ETV Bharat / business

బెంజ్‌ కారు కావాలా నాయనా! - ఐటీ ఉద్యోగులకు బెంజ్​ కారు

కొవిడ్‌ నేపథ్యంలో తమ ఉద్యోగుల్లో ఇంటి నుంచి పనిచేసే వారే అత్యధికంగా ఉన్నందున, వారిని అనుక్షణం కనిపెట్టుకుని ఉండేందుకు ఐటీ సంస్థలు శ్రమిస్తున్నాయి. ప్రతిభావంతులకు హెచ్‌సీఎల్‌ టెక్‌ మెర్సిడెస్‌ బెంజ్‌ కారు ఇస్తామంటుంటే.. వేతన పెంపు, పదోన్నతులు, బోనస్‌లను ప్రకటిస్తున్నాయి మరికొన్ని సంస్థలు.

IT companies offers, incentives for IT employees
బెంజ్‌ కారు కావాలా నాయనా..
author img

By

Published : Jul 22, 2021, 8:28 AM IST

ఐటీ సంస్థలకు ప్రాజెక్టులు వరుస కట్టడం వల్ల.. బాగా పనిచేసే నిపుణులను అట్టేపెట్టుకునేందుకు కంపెనీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కొవిడ్‌ నేపథ్యంలో, ఇంటి నుంచి పనిచేసే వారే అత్యధికంగా ఉన్నందున, వారిని అనుక్షణం కనిపెట్టుకుని ఉండటమే కాక, కంపెనీని వీడకుండా చూడటంలో మానవ వనరుల విభాగాలు శ్రమిస్తున్నాయి. ప్రతిభావంతులకు హెచ్‌సీఎల్‌ టెక్‌ మెర్సిడెస్‌ బెంజ్‌ కారు ఇస్తామంటుంటే, వేతన పెంపు, పదోన్నతులు, బోనస్‌లను టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో ప్రకటించాయి.

ఖాతాదార్లకు ప్రాజెక్టులు సకాలంలో ఇవ్వాలంటే, నిపుణులే కీలకం. అన్ని రంగాలు డిజిటలీకరణ దిశగా సాగున్నందున, కృత్రిమమేధ, క్లౌడ్‌, మెషీన్‌ లెర్నింగ్‌ సాంకేతిక నైపుణ్యాలున్న వారికి ఐటీ కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయి. నిపుణులు వేరే సంస్థలకు వలస వెళ్లకుండా ప్రయత్నిస్తున్నాయి. నగదు ప్రోత్సాహకాలు, ఇతరత్రా బహుమతులు అందజేసేందుకు ముందుకొస్తున్నాయి. ప్రతిభావంతుల స్థానాల్ని కొత్తవారితో భర్తీ చేయాలంటే 20 శాతం అదనపు వ్యయం అవుతోందని, దీని కంటే ఉన్న వారికే వేతనాలు పెంచితేనే వ్యయాలు తక్కువగా ఉంటాయని కంపెనీలు భావిస్తున్నాయి.

'ప్రతిభావంతులకు మెర్సిడెస్‌ బెంజ్‌ కారును కానుకగా పొందే అవకాశం కల్పించాలనుకుంటున్నాం. బోర్డు ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాం' అని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ముఖ్య మానవ వనరుల అధికారి (సీహెచ్‌ఆర్‌ఓ) వి.వి.అప్పారావు వెల్లడించారు. 2013లోనూ ఈ సంస్థ 50 మంది ప్రతిభావంతులకు మెర్సిడెస్‌ బెంజ్‌ కార్లను అందించినా, తరవాత నిలిపివేసింది. 'జావా డెవలపర్‌ వంటి నిపుణులు మేమిస్తున్న వేతనాలకు దొరుకుతున్నారు.. కానీ క్లౌడ్‌ నిపుణులు లభించడం లేద'ని అప్పారావు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 22,000 మంది కొత్తవారిని (ఫ్రెషర్లు) నియమించుకుంటున్నామని తెలిపారు. ఈ సంస్థలో వలసల రేటు 11.8 శాతంగా ఉంది.

10-20 శాతం బోనస్‌లు

ఇన్ఫోసిస్‌లో వలసల రేటు 10.9 శాతం నుంచి 13.9 శాతానికి చేరిందని సీఓఓ యూబీ ప్రవీణ్‌రావు వెల్లడించారు. విప్రోలో ఈ రేటు 15.5 శాతానికి చేరిందని సీఈఓ థియర్రీ డెలాపోర్ట్‌ పేర్కొన్నారు. వలసలు నిరోధించేందుకు గత జూన్‌ త్రైమాసికంలో 10,000 మందికి పదోన్నతులు ఇచ్చినట్లు విప్రో ముఖ్య మానవ వనరుల అధికారి సౌరభ్‌ గోవిల్‌ తెలిపారు. 'ఈ ఏడాది 12,000 మంది ఫ్రెషర్లను, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 30,000 మందిని ప్రాంగణ నియామకాల ద్వారా ఎంపిక చేసుకుంటామ'ని సౌరభ్‌ తెలిపారు. నైపుణ్యాల ఆధారంగా జూన్‌ త్రైమాసికంలో 10,000 మందికి 10-20 శాతం బోనస్‌ అందించామన్నారు. టీసీఎస్‌ కూడా 2020 అక్టోబరు, 2021 ఏప్రిల్‌లో.. అంటే 6 నెలల్లోనే 2 సార్లు వేతనాలు పెంచింది. ఆసక్తి ఉన్నవారు కార్యాలయానికి వచ్చి పనిచేసే వీలునూ కంపెనీలు కల్పిస్తున్నాయి.

ఇదీ చదవండి : 5జీ కోసం ఇంటెల్​తో ఎయిర్​టెల్ జట్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.