జియోలోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఎలక్ట్రానిక్ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ ఇన్వెస్ట్‌మెంట్‌కు చెందిన 'ఇంటెల్ క్యాపిటెల్'... జియో ప్లాట్‌ఫామ్స్‌లో 0.39 శాతం వాటాను రూ.1,894.50 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది.
ఇప్పటి వరకు జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులు పెట్టిన సంస్థల్లో ఇంటెల్ క్యాపిటల్ 12వది. తాజా పెట్టుబడితో జియోకు వచ్చిన మొత్తం పెట్టుబడులు రూ.1,17,588.45 కోట్లకు చేరాయి.
"జియో ప్లాట్‌ఫామ్స్ అద్భుతమైన ఇంజినీరింగ్ సామర్థ్యాలను వినియోగిస్తూ.. తక్కువ ఖర్చుతో డిజిటల్ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాయి."
- వెండెల్ బ్రూక్స్, ఇంటెల్ క్యాపిటల్ ప్రెసిడెంట్
జియో ప్రణాళిక..
2021 వరకు సంస్థను రుణరహితంగా మార్చాలని రిలయన్స్ భావిస్తోంది. ఇందులో భాగంగానే జియో వరుస పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇందుకోసం జియోలో 25 శాతం మైనారిటీ వాటాను వాటాదార్లకు విక్రయించాలని నిర్ణయించింది. విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో... జియోలో వాటా విక్రయాల ప్రక్రియ దాదాపు పూర్తయినట్లేనని తెలుస్తోంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలో జియో ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. భారత్ మార్కెట్లో 38.8 కోట్ల మంది చందాదారులతో జియో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఇదీ చూడండి: గుడ్‌న్యూస్: ఆగస్టు 15 కల్లా మార్కెట్లోకి కోవ్యాక్సిన్!