ETV Bharat / business

'2021లో భారత వృద్ధి రేటు 12 శాతం' - Vaccinations

గతేడాది 7.1 శాతం కుంగిన భారత ఆర్థిక వ్యవస్థ.. 2021లో 12 శాతం వృద్ధి నమోదు చేయనుందని మూడీస్‌ అనలిటిక్స్ అంచనా వేసింది. కొవిడ్​ ఆంక్షల ఎత్తివేతతో ఉత్పాదక కార్యక్రమాలు పెరిగాయని వెల్లడించింది.

author img

By

Published : Mar 20, 2021, 5:30 AM IST

దేశ జీడీపీ 2021లో 12 శాతం వృద్ధిచెందే అవకాశం ఉందని ప్రముఖ విశ్లేషణ సంస్థ మూడీస్‌ అనలిటిక్స్​ అంచనా వేసింది. ఊహించని విధంగా డిసెంబ‌ర్ నెలలో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ 0.4 శాతానికి పెరగ‌డం సానుకూల ప‌రిణామాల‌కు సంకేతమని మూడీస్ వ్యాఖ్యానించింది.

ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పుంజుకోవడంతో పాటు దేశీయంగానూ లాక్‌డౌన్‌ తర్వాత సానుకూల పవనాలు కనిపిస్తున్న నేపథ్యంలో తయారీ రంగం పుంజుకుందని మూడీస్‌ తెలిపింది. రానున్న రోజుల్లో వ్యక్తిగత వినిమయంతో పాటు గృహేతర పెట్టుబడులు పుంజుకోనున్నాయని, ఇది దేశీయంగా గిరాకీ పుంజుకోవడానికి దోహదం చేయనుందని పేర్కొంది.

ఆర్థిక, ద్రవ్య విధానాలు కూడా వృద్ధికి దన్నుగా నిలవనున్నాయని తెలిపింది. కీలక వడ్డీరేట్లు మరింత తగ్గే అవకాశం లేదని పేర్కొంది. అయితే, దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు వృద్ధికి సవాల్‌ విసరనున్నాయని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: ప్రపంచ నాయకులు, సామాన్యులకు ట్విట్టర్​ సేమ్​ రూల్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.