ETV Bharat / business

కరోనా కాలంలో భారీగా పెరిగిన 'ఫార్మా' ఎగుమతులు

భారత్​లో ఔషధరంగ ఉత్పత్తుల ఎగుమతులు భారీగా పెరిగాయి. అంతకుముందు సంవత్సరంతో పోల్చుకుంటే ఎగుమతులు 18శాతం వృద్ధి సాధించినట్లు ఫార్మాస్యుటికల్స్​​ ఎక్స్​పోర్ట్​ ప్రమోషన్​ కౌన్సిల్ ఆఫ్​ ఇండియా(ఫార్మెక్సిల్​) పేర్కొంది.

Indian pharma exports growth, global pharma market
భారీగా పెరిగిన 'ఫార్మా' ఎగుమతులు
author img

By

Published : Apr 17, 2021, 1:47 PM IST

గత ఆర్థిక సంవత్సరంలో భారత్ ​నుంచి ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు భారీగా పెరిగాయి. అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే 18శాతం వృద్ధిని నమోదు చేసినట్లు ఫార్మాస్యుటికల్స్​​ ఎక్స్​పోర్ట్​ ప్రమోషన్​ కౌన్సిల్ ఆఫ్​ ఇండియా(ఫార్మెక్సిల్​) తెలిపింది. ఈ వృద్ధితో ఎగుమతుల మొత్తం విలువ 24.44 బిలియన్​ డాలర్లకు చేరింది. అయితే 2020 ఆర్థిక సంవత్సరంలో వీటి విలువ 20.58 బిలియన్​ డాలర్లుగా ఉంది.

"ఈ ఆర్థిక సంవత్సరంలో ఫార్మా ఎగుమతులు బాగా పెరిగాయి. 2021 మార్చిలో 2.3 బిలియన్​ డాలర్ల ఉత్పత్తులను ఎగుమతి చేశాం. ఈ మొత్తం గత ఆర్థిక సంవత్సరంలోని అన్ని నెలల కన్నా పెద్దమొత్తం. అంతకుముందు ఏడాది ఇదే నెలతో పోల్చితే వృద్ధిరేటు 48.5 శాతంగా నమోదైంది."

-ఉదయ్​ భాస్కర్​, డైరెక్టర్​ జనరల్​ ఆఫ్ ఫార్మెక్సిల్

గతేడాది ప్రపంచవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించడం కారణంగా ఆ ప్రభావం ఎగుమతుల మీద పడింది. దీంతో మార్చి 2020లో ఉత్పత్తులు తగ్గాయి. ఈ మార్చి నెలతో పోల్చిచూస్తే భారీగా వృద్ధి సాధించినట్లు స్పష్టం అవుతోందని ఉదయ్​ భాస్కర్​ తెలిపారు.

ప్రపంచ ఫార్మారంగం నెగెటివ్​లో..

2020లో ప్రపంచ ఫార్మారంగం వృద్ధి 1-2 శాతం తిరోగమనంలో ఉంది. కానీ భారత్​లో మాత్రంలో అందుకు భిన్నం. నాణ్యతతో కూడిన జెనెరిక్ మందులను చౌకైన ధరలకు భారతదేశం ఉత్పత్తి చేస్తోంది. దీంతో అధిక డిమాండ్​ ఏర్పడింది. ఈ ఉత్పత్తుల్లో భారత్​ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది.

ఇదీ చూడండి: కరోనా 2.0తో పారాసెట్మాల్‌కు అధిక గిరాకీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.