ETV Bharat / business

బిలియనీర్ల క్లబ్​లోకి మరో 40 మంది భారతీయులు - కరోనా సమయంలో 40 మంది భారతీయలు బిలియనీర్ల జాబితాలోకి

కరోనా సమయంలో భారత్​ నుంచి కొత్తగా 40 మంది బిలియనీర్ల జాబితాలోకి చేరినట్లు హురున్ గ్లోబల్ సంస్థ తన రిపోర్ట్​లో వెల్లడించింది. రిలయన్స్ అధినేత ముఖేశ్‌ అంబానీ భారత్‌లోని సంపన్నుల్లో మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నట్లు పేర్కొంది. ఆయన సంపద 24 శాతం మేర పెరిగినట్లు తెలిపింది. వాణిజ్య నగరం ముంబయి నుంచి ఎక్కువ మంది సంపన్నులు ఉన్నట్లు వివరించింది.

India adds 40 billionaires in pandemic year; Adani, Ambani see rise in wealth: Report
కరోనా వేళ 40 మంది భారతీయలు బిలియనీర్ల జాబితాలోకి
author img

By

Published : Mar 2, 2021, 2:44 PM IST

కరోనాతో ఏడాది కాలంగా ప్రపంచమంతా సతమతం అవుతున్న వేళ.. అందులో నుంచే అవకాశాలు అందిపుచ్చుకున్న కొందరు భారతీయులు ఈ ఏడాదిలోనే బిలియనీర్ల జాబితాలోకి చేరారు. 'హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్'‌లో కొత్తగా 40 మంది భారతీయులు బిలియనీర్లుగా మారారు. వీరితో కలిపి భారతీయ బిలియనీర్ల జాబితా 177కి పెరిగింది.

అంబానీదే అగ్రస్థానం

  • రిలయన్స్ అధినేత ముఖేశ్‌ అంబానీ భారత్‌లోని సంపన్నుల్లో మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆయన సంపద 24 శాతం మేర పెరిగింది. అంతేకాకుండా ప్రపంచ కుబేరుల జాబితాలో ఓ స్థానం మెరుగుపరుచుకొని 8వ స్థానాన్ని అందుకున్నారు.
  • గుజరాత్‌కే చెందిన మరో పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ సంపద 2020లో రెండింతలు పెరిగి 32 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రపంచ ధనవంతుల జాబితాలో 20 స్థానాలు మెరుగై 48వ స్థానంలో నిలిచారు.
  • గౌతమ్​ అదానీ సోదరుడైన వినోద్ సంపద 128 శాతం మేర పెరిగి 9.8 బిలియన్ డాలర్లకు చేరింది. సాంకేతికపరమైన సంపద సృష్టి పూర్తిగా పుంజుకుంటే అమెరికాలోని బిలియనీర్లను భారత్ దాటేస్తుందని హురున్ గ్లోబల్ తెలిపింది.
  • హెచ్​సీఎల్​ అధినేత శివ్‌నాడార్‌ భారత్‌లోని కుబేరుల జాబితాలో 27 బిలియన్ డాలర్ల సంపదతో మూడో స్థానంలో ఉన్నారు.
  • కాలర్ సాప్ట్‌వేర్ సంస్థ అధినేత జయ్‌ చౌదరి ఆస్తులు 274 శాతం మేర పెరిగి 13 బిలియన్ డాలర్లు అయ్యాయి.
  • బైజు రవీంద్రన్‌, ఆయన కుటుంబ సభ్యుల సంపద 100 శాతం మేర పెరిగి 2.8 బిలియన్ డాలర్లకు చేరినట్లు హురున్ గ్లోబల్ పేర్కొంది.
  • మహింద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహింద్ర, ఆయన కుటుంబ సంపద 100 శాతం పెరిగి 2.4 బిలియన్ డాలర్లు అయ్యింది.

సంపదల్లో క్షీణత

ఇదే సమయంలో కొందరి సంపదల్లో క్షీణత కనిపించింది. పతంజలి ఆయుర్వేద అధినేత ఆచార్య బాలకృష్ణ సంపద 32 శాతం మేర తగ్గి 3.6 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అటు వాణిజ్య రాజధాని ముంబయి నుంచి 60 మంది బిలియనీర్లు ఉండగా తర్వాతి స్థానంలో 40 మందితో దిల్లీ, 22 మందితో బెంగళూరు ఉన్నాయి. మహిళల్లో చూస్తే బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్‌షా సంపద 41 శాతం మేర పెరిగి 4.8 బిలియన్ డాలర్లకు చేరింది. గోద్రేజ్ స్మిత వి కృష్ణ సంపద 4.7 బిలియన్ డాలర్లు కాగా లుపిన్‌ మంజుగుప్త ఆస్తుల విలువ 3.3 బిలియన్ డాలర్లుగా హురున్ గ్లోబల్ వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 197 బిలియన్ డాలర్లతో మొదటిస్థానంలో ఉండగా తర్వాత అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 189 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. ఫ్రెంచ్‌ వ్యక్తి బెర్నార్డ్ ఆర్నాల్డ్ 114 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు.

ఇదీ చదవండి : ముకేశ్, మస్క్​ పోటాపోటీ.. సంపదలో కాదు!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.