ETV Bharat / business

'అవి మెయిల్సే.. రికవరీ నోటీసులు కావు' - tax news

బకాయిలు చెల్లించాలని కోరుతూ పంపిన ఈ-మెయిల్స్​ను రికవరీ నోటీసులుగా పరిగణించవద్దని ఆదాయపన్ను శాఖ కోరింది. పన్ను రీఫండ్​ ఎవరెవరికి ఎంతెంత చెల్లించాలనే దానిపై స్పష్టత కోసం పంపినట్లు వెల్లడించింది.

I-T dept sends e-mails
'అవి మెయిల్సే.. రికవరీ నోటీసులు కావు'
author img

By

Published : Apr 22, 2020, 5:36 AM IST

పన్ను బకాయిలు చెల్లించాలని కోరుతూ 1.72 లక్షల మందికి ఈ-మెయిల్స్‌ పంపింది కేంద్ర ఆదాయపన్ను శాఖ. అయితే.. వాటిని రికవరీ నోటీసులుగా పరిగణించవద్దని కోరింది. అవి కేవలం పన్ను రీఫండ్‌ను తిరిగి ఎవరెవరికి ఎంతెంత చెల్లించాలనే దానిపై స్పష్టత కోసం పంపినట్లు వెల్లడించింది.

" పన్ను చెల్లింపుదారులు తమ బకాయిల గురించిన సమాచారం ఐటీ శాఖతో పంచుకునేందుకే ఈ-మెయిల్స్ పంపడం జరిగింది. వీటి ద్వారా ఇప్పటికే పన్ను చెల్లించిన వారు, ఒక వేళ చెల్లించకపోతే ఎంత బకాయి ఉన్నారు అనే దానికి సంబంధించిన సమాచారాన్ని ఐటీ శాఖకు తెలియజేయవచ్చు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోము. ఒక వేళ ఎవరైనా ఇప్పటికే పన్ను చెల్లించి ఉంటే ఈ సమాచారం ఆధారంగా పన్ను రీఫండ్‌లో ఆ మొత్తాన్ని మినహాయించుకోము. పన్ను రీఫండ్ ప్రక్రియలో కూడా ఎలాంటి జాప్యం లేకుండా తిరిగి చెల్లించేందుకు ఈ ప్రక్రియ సహాయపడుతుంది. "

- ఆదాయపన్ను శాఖ.

అంకుర సంస్థల అసంతృప్తి..

ఐటీ శాఖ పంపిన మెయిల్ నోటీసుల జాబితాలో అంకుర సంస్థల నుంచి వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. ఈ-మెయిల్స్‌పై పలు అంకుర సంస్థల యజమానులు సామాజిక మాధ్యమాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ట్యాగ్‌ చేస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో వీటిపై ఐటీ శాఖ వివరణ ఇచ్చింది. అవి కంప్యూటర్‌ జనరేటెడ్ ఈ-మెయిల్స్‌ అని తెలిపింది. కేవలం పన్ను బకాయిలకు సంబంధిచిన సమాచారం, రీ ఫండ్ చెల్లింపులను వేగవంతం చేసేందుకే అవి పంపినట్లు తెలిపింది.

కరోనా నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉండటం వల్ల అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో వ్యాపారులు, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగిస్తూ రూ.9,000 కోట్ల పన్ను రీఫండ్‌ను వెంటనే చెల్లించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీని వల్ల దేశవ్యాప్తంగా 14 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది.

ఇదీ చూడండి: గోల్డ్​ బాండ్ల కొనుగోలుకు 24 వరకు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.