ETV Bharat / business

గోల్డ్​ బాండ్ల కొనుగోలుకు 24 వరకు అనుమతి - gold bonds launching

బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది మొగ్గుచూపుతారు. అయితే.. పసిడిని కొనుగోలు చేసిన కొన్నాళ్లకు అందులో తరుగు తదితర సమస్యలు ఉంటాయి. ఎంతో కొంత నష్టపోవాల్సి వస్తుంది. వీటికి ప్రత్యామ్నాయంగా సార్వభౌమ గోల్డ్​ బాండ్లు తీసుకొచ్చింది రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్బీఐ). పసిడి బాండ్ల కొనుగోలుకు నేటి నుంచి 24 వరకు అనుమతించనున్నారు.

gold bonds
గోల్డ్​ బాండ్లు
author img

By

Published : Apr 21, 2020, 9:03 AM IST

బంగారం భౌతికంగా కొనుగోలు చేసినట్లయితే... తరుగు తదితర సమస్యలు ఉంటాయి. అంతేకాకుండా దానిపై ధరలో పెరుగుదల తప్ప ఎలాంటి ఆదాయం ఉండదు. ఈ సమస్యలు లేకుండా ఉండటంతో పాటు వడ్డీ ప్రయోజనం పొందేందుకు ఉద్దేశించినవే సార్వభౌమ గోల్డ్ బాండ్లు. 2020 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడత గోల్డ్ బాండ్ల కొనుగోలు సోమవారం మొదలైంది. అసలు ఈ గోల్డ్ బాండ్లు అంటే ఏమిటి? వీటిలో పెట్టుబడి వల్ల ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుందాం.

సార్వ‌భౌమ గోల్డ్ బాండ్లు అనేవి ప్ర‌భుత్వం జారీచేసే ప్ర‌భుత్వ బాండ్ల‌లాంటివి. వీటిని ప్రభుత్వం తరపున ఆర్బీఐ విడుదల చేస్తుంది. భౌతిక బంగారం కొనుగోలుకు ఇది ప్రత్యామ్నాయం లాంటిది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడత గోల్డ్ బాండ్లను రిజర్వు బ్యాంకు సోమవారం విడుదల చేసింది. మొత్తంగా ఈ సంవత్సరం ఆరు విడుతల్లో వీటిని ఆర్బీఐ విడుదల చేయనుంది.

ఆన్ లైన్ లో డిస్కౌంట్...

ప్రస్తుతం జారీ చేసిన బాండ్లు ఏప్రిల్ 23 వరకు కొనుగోలు చేసుకోవచ్చు. గ్రాముకు రూ.4,639గా ఆర్బీఐ నిర్ణయించింది. డిజిటల్ పద్ధతిలో కొనుగోలు చేసినట్లయితే రూ.50 డిస్కౌంట్ పొందవచ్చు. కనీసం ఒక గ్రామును కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీటి మెచ్యూరిటీ పీరియడ్ ఎనిమిది సంవత్సరాలు. కానీ ఐదు సంవత్సరాల అనంతరం పెట్టుబడిని వెనక్కి తీసుకునే అవకాశం ఉంది.

2.5 శాతం వడ్డీ..

సాధారణంగా బంగారం కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకున్నట్లయితే దానిపై ఎలాంటి ప్రయోజనం ఉండదు. అంతేకాకుండా కొన్నాళ్లకి తరుగు లాంటిది వచ్చి ఉన్న విలువ తగ్గిపోతుంది. ఈ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టటం ద్వారా తరుగు లేకపోగా.. 2.5 శాతం వడ్డీ కూడా లభిస్తుంది. మెచ్యూరిటీ అనంతరం అప్పుడు ఉన్న ధరలకు అనుగుణంగా నగదు పొందవచ్చు. మొత్తంగా బంగారంపై ధర పెరుగుదల ప్రయోజనాలతో పాటు వడ్డీ పొందటం వల్ల మొత్తం మీద ఆదాయం ఎక్కువ ఉంటుంది.

బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, స్టాక్ ఎక్స్చేంజీ, ఎంపిక చేసిన పోస్టాఫీసుల ద్వారా ఇవి లభిస్తాయి. ఈ బాండ్లు ఇష్యూ చేసిన అనంతరం 15 రోజుల తర్వాత స్టాక్ ఎక్స్చేంజీలలో ట్రేడవుతాయి.

పన్ను ప్రయోజనాలు..

గోల్డ్ బాండ్లలో పెట్టుబడి వల్ల పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. సాధారణంగా గోల్డ్ ఈటీఎఫ్​ల లాంటి వాటిపై వర్తించే మూలధన లాభాల పన్ను వీటిపై వర్తించదు. అయితే.. దీనికోసం మొత్తం మెచ్యూరిటీ పీరియడ్ అనంతరం మాత్రమే రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ముందు పెట్టుబడిని తీసుకున్నట్లయితే.. మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది.

ఈ సంవత్సరం వచ్చే ఆరు విడతల గోల్డ్ బాండ్ల వివరాలు:

సిరీస్ కొనుగోలు తేదీఇష్యూ తేదీ
2020-21 సిరీస్ I ఏప్రిల్ 20-24 ఏప్రిల్ 28, 2020
2020-21 సిరీస్ IIమే 11-15మే 19,2020
2020-21 సిరీస్ IIIజూన్ 08-12జూన్ 16,2020
2020-21 సిరీస్ IVజులై 06-10జులై 14,2020
2020-21 సిరీస్ Vఆగస్టు 03-07ఆగస్టు 11,2020
2020-21 సిరీస్ VIఆగస్టు 31- సెప్టెంబర్ 04సెప్టెంబర్ 08,2020

ఇదీ చూడండి: మాల్యాకు బ్రిటన్​ హైకోర్టు షాక్​- భారత్​కు పంపడం ఖాయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.