ETV Bharat / business

మాల్యాకు బ్రిటన్​ హైకోర్టు షాక్​- భారత్​కు పంపడం ఖాయం! - విజయ్​మాల్యా పిటిషన్

liquor-tycoon-vijay-mallya-loses-his-high-court-appeal-in-uk-against-his-extradition-order-to-india
విజయ్​మాల్యా పిటిషన్​ను​ కొట్టేసిన యూకే హైకోర్టు
author img

By

Published : Apr 20, 2020, 3:41 PM IST

Updated : Apr 20, 2020, 5:07 PM IST

15:33 April 20

ఆర్థిక నేరస్థుడు, లిక్కర్ కింగ్ విజయ్​మాల్యాకు యూకే​ న్యాయస్థానం షాకిచ్చింది. భారత్​కు అప్పగించడాన్ని సవాలు చేస్తూ అతడు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టివేసింది. 

14 రోజుల్లో అవకాశం..

హైకోర్టులో చుక్కెదురైనా 14 రోజుల్లో యూకే సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు మాల్యాకు అవకాశముంది. ఇందుకు దరఖాస్తు​ పెట్టుకుంటే ఆ దేశ హోంశాఖ తదుపరి విచారణ వరకు వేచిచూడనుంది. లేదంటే మాల్యాను భారత్​-యూకే నేరస్థుల అప్పగింత చట్టం ప్రకారం 28 రోజుల్లో భారత ప్రభుత్వానికి అప్పగించనుంది.

పోరులో విజయం: సీబీఐ

ఆర్థిక నేరస్థులపై భారత ప్రభుత్వం చేస్తోన్న పోరులో ఇదొక విజయమని అభివర్ణించింది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). మాల్యా పిటిషన్​ను హైకోర్టు కొట్టేయడంపై హర్షం వ్యక్తం చేసింది.

బ్యాంక్​ల నుంచి రుణాలు తీసుకొని దేశం నుంచి పారిపోయాడు మాల్యా. 2016 మార్చిలో దేశం వదిలి వెళ్లిపోయిన అతడు.. అప్పటి నుంచి బ్రిటన్‌లో తలదాచుకుంటున్నాడు.

Last Updated : Apr 20, 2020, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.