కొవిడ్ ప్రభావం హైదరాబాద్ స్థిరాస్తిపై తక్కువే ఉందని ఆనరాక్ నివేదిక స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లోని వ్యాపార సముదాయాలున్న ప్రాంతాల్లో అద్దెలు తగ్గగా హైదరాబాద్లో మాత్రం అద్దెలు పెరిగాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి ప్రాంతాల్లో సరాసరి నెల వారీ అద్దె క్రితం ఏడాది మొదటి త్రైమాసికంతో పోల్చితే ఈ సంవత్సరం జనవరి-మార్చి మధ్య 7 నుంచి 15 శాతం పెరిగినట్లు స్థిరాస్తి అధ్యయన సంస్థ ఆనరాక్ వెల్లడించింది. ఇతర నగరాల్లో 2-30 శాతం అద్దె తగ్గినట్లు నివేదిక పేర్కొంది.
దేశంలోని ప్రధాన నగరాల్లోని అద్దెల వివరాలు..
దిల్లీ
- దేశ రాజధానిలో ప్రఖ్యాత రిటైల్ హబ్ ఖాన్ మార్కెట్లో అద్దెలు 8 నుంచి 17 శాతం తగ్గాయి.
ముంబయి
- ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబయిలో వ్యాపార ప్రాంతాలైన ఖాలాగోడా, ఫోర్ట్ ఏరియా, బాంద్రా లింకింగ్ రోడ్లో అద్దె 5 నుంచి 10 శాతం తగ్గింది.
- మరో ప్రధాన నగరం పుణెలోని ఎంజీ రోడ్, జేఎమ్ రోడ్ ప్రాంతాల్లో 8 నుంచి 20శాతం అద్దెలు తగ్గాయి.
బెంగళూరు
- ఐటీ సిటీగా పేరొందిన బెంగళూరులోని బ్రిగేడ్ రోడ్లో అద్దెలు 8 నుంచి 17 శాతం తగ్గాయి.
ఇవీ చదవండి: సవాళ్లను అధిగమించి.. పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్