ETV Bharat / business

'మరో ఐదేళ్లు జీఎస్టీ పరిహారం ఇవ్వాల్సిందే' - జీఎస్టీ పరిహారం రాష్ట్రాలకు

GST Compensation To States States: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అందించే జీఎస్టీ పరిహారాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగించాలని పలు రాష్ట్రప్రభుత్వాలు డిమాండ్ చేశాయి. అంతేకాక కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కేంద్రం వాటాను కూడా పెంచాలన్నాయి.

GST
జీఎస్టీ
author img

By

Published : Dec 30, 2021, 7:45 PM IST

GST Compensation To States States: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అందించే జీఎస్టీ పరిహారం గడువు 2022, జూన్​తో ముగియనున్న క్రమంలో మరో ఐదేళ్లపాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్​ చేశాయి. కొవిడ్​-19 మహమ్మారి కారణంగా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయని తెలిపాయి.

బడ్జెట్​పై కసరత్తులో భాగంగా.. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థికశాఖ మంత్రులతో ముందస్తు బడ్జెట్ సమావేశం నిర్వహించారు.

Pre-Budget Meeting
ముందస్తు బడ్జెట్ సమావేశంలో నిర్మలా సీతారామన్​

జీఎస్టీ పరిహారాన్ని మరో ఐదేళ్లు పొడిగించడమే కాక కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కేంద్రం వాటాను కూడా పెంచాలన్నారు ఛత్తీస్​గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భఘేల్​. జీఎస్టీ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని వివరించారు. వచ్చే ఏడాదిలోనూ రాష్ట్రానికి రూ. 5వేల కోట్లు నష్టం వాటిల్లనుందని నివేదించారు.

వాటిపై సుంకాన్నీ తగ్గించాలి..

"జీఎస్టీ పరిహారాన్ని పొడిగించాలని చాలా రాష్ట్రాలు డిమాండ్ చేశాయి. కేంద్రం పొడిగించకపోతే అన్ని రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదం ఉంది." అని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అభిప్రాయం వ్యక్తంచేశారు.

జీఎస్టీ పరిహారాన్ని 2026-27 వరకు పొడిగించాలన్న డిమాండ్ సరైనదేనని రాజస్థాన్ విద్యాశాఖమంత్రి సుభాష్ గార్గ్ తెలిపారు. కేంద్రం ఈ డిమాండ్​ను పరిశీలించాలని కోరారు. అలాగే బంగారం, వెండి దిగుమతి గ్రాంట్​ను 10 నుంచి 4శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.

Pre-Budget Meeting
సమావేశానికి హాజరైన అధికారులు, మంత్రులు

"కేంద్ర పథకాల్లో కేంద్రం ప్రభుత్వం.. తన వాటాను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. రాష్ట్రాలు ఆ వాటాను భరిస్తున్నాయి. ఇంతకుముందు కేంద్ర పథకాల్లో కేంద్రం, రాష్ట్ర వాటాలు 90-10 నిష్పత్తిలో ఉండగా ప్రస్తుతం 50-50 లేదా 60-40గా ఉన్నాయి." అని సుభాష్ గార్గ్ తెలిపారు. అంతేకాక అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను కేంద్ర పథకాల్లో చేర్చాలని రాజస్థాన్ సర్కార్ డిమాండ్ చేసింది.

రెండేళ్లపాటు కొవిడ్​-19తో ఇబ్బందులు పడటం వల్ల జీఎస్టీ పరిహారాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగించాలని బంగాల్​ ప్రభుత్వం డిమాండ్ చేసింది. కేంద్ర పథకాల్లో ప్రభుత్వం వాటాను పెంచాలని సూచించింది.

కొవిడ్​-19 దృష్ట్యా కనీసం మరో రెండేళ్లపాటైనా రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని అందించాలని తమిళనాడు ఆర్థికశాఖ మంత్రి పి. త్యాగరాజన్ డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: ఎన్నికల వేళ ఫారిన్​ టూర్.. భాజపాకు మళ్లీ ఛాన్స్ ఇచ్చిన రాహుల్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.