ఎయిర్ ఇండియాలో నూరుశాతం వాటా విక్రయానికి సంబంధించి ..కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక సమాచార పత్రాన్ని విడుదల చేసింది. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో ఉన్న నూరు శాతం వాటా, సంయుక్త భాగస్వామ్య సంస్థ ఎయిర్‌పోర్టు సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లోని.. 50శాతం వాటాను కూడా విక్రయించనుంది.
విజయవంతమైన బిడ్డర్‌కు యాజమాన్య నియంత్రణను కూడా.. బదిలీ చేయనున్నట్లు కేంద్ర విడుదల చేసిన... సమాచార పత్రంలో పేర్కొన్నారు.
ఎయిర్ ఇండియాలో వాటాల కొనుగోలుకు మార్చి 17లోపు.. ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను సమర్పించాలని కేంద్రం స్పష్టంచేసింది.
ఎయిర్ ఇండియా ఉద్యోగ సంఘాల సమావేశం
ప్రైవేటీకరణపై కేంద్రం అధికారిక ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో దిల్లీలో ఈరోజు సమావేశం కావాలని ఎయిర్ ఇండియా ఉద్యోగులు భావిస్తున్నారు. సంస్థకు సంబంధించిన అన్ని ఉద్యోగ సంఘాలు ఈ భేటీలో పాల్గొనున్నాయి.