ETV Bharat / business

'30 రోజుల్లో టూరిస్ట్ వాహనాలకు ఆల్​ ఇండియా పర్మిట్' - పర్యటక రంగానికి కేంద్రం కొత్త ప్రోత్సాహకాలు

కరోనాతో కుదేలైన పర్యటక రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పర్యటక వాహనాల యజమానులు ఆల్​ ఇండియా టూరిస్ట్ అనుమతి కోసం ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకుంటే.. 30 రోజుల్లో మంజూరు చేసేలా కొత్తగా ఓ పథకాన్ని తీసుకురానుంది.

Center new scheme for all India tour
అఖిల భారత పర్యటక రంగానికి కేంద్ర ప్రోత్సాహకాలు
author img

By

Published : Mar 14, 2021, 7:28 PM IST

దేశంలో పర్యటక రంగానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాల ఆల్​ ఇండియా పర్యటక అనుమతులకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటే 30 రోజుల్లో మంజూరు చేసే కొత్త పథకాన్ని తేనుంది.

పర్యటక వాహనాల యజమానులు ఆల్​ ఇండియా పర్యటన అనుమతి కోసం ఆన్‌లైన్‌లో సంబంధిత పత్రాలు, రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకుంటే 30 రోజుల్లో అనుమతి లభిస్తుంది. అఖిల భారత పర్యాటక వాహనాల ప్రాధికార, అనుమతి పేరుతో కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ రూపొందించిన ఈ నిబంధనలు 2021 ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి. కొత్త నిబంధనలు వచ్చినా.. అప్పటికే ఉన్న విధానం నిర్ణీత కాలపరిమితి ముగిసే వరకు అమలులో ఉంటుంది.

కొత్త విధానం వల్ల రాష్ట్రాల మధ్య పర్యటకం పెరగడం సహా వాటి ఆదాయం కూడా వృద్ధి చెందుతుందని రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. గత పదిహేనేళ్ల కాలంలో దేశంలో పర్యటక రంగం బాగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ పథకాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.

ఇదీ చదవండి:సోమ, మంగళవారాల్లో బ్యాంకులు బంద్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.