ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PM Jan-Dhan Yojana) పథకం ద్వారా బ్యాంక్ ఖాతాల సంఖ్య 43 కోట్లు దాటింది. ఈ ఖాతాలన్నింటిలో కలిపి ఇప్పటి వరకు రూ.1.46 లక్షల కోట్లు డిపాజిట్ (deposits in Jan-Dhan accounts) అయినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది.
ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఖాతా ఉండాలనే ఉద్దేశంతో 2014 ఆగస్టు 28న ఈ పథకాన్ని ప్రారంభించింది ప్రభుత్వం. సరిగ్గా ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా పథకం పనితీరును వివరిస్తూ ఈ గణాంకాలను విడుదల చేసింది.
మహిళల ఖాతాలే అత్యధికం..
ఈ నెల 18 నాటికి మొత్తం 43.04 కోట్ల జన్ ధన్ ఖాతాలు ఉండగా.. అందులో 55.47 శాతం (23.70 కోట్లు) మహిళలకు చెందివే కావడం విశేషం. మొత్తం ఖాతాల్లో 66.69 శాతం (23.70 కోట్లు) గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాలకు చెందిన వారివే.
అయితే 43.04 జన్ ధన్ బ్యాంక్ ఖాతాల్లో.. 36.86 ఖాతాలు (85.6 శాతం) క్రియాశీలంగా ఉన్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. యాక్టివ్గా ఉన్న ఒక్కో ఖాతాలో సగటు డిపాజిట్ రూ.3,398గా ఉన్నట్లు వెల్లడించింది.
రూపే కార్డులు@ 31.23 కోట్లు..
జన్ ధన్ ఖాతాదారుల్లో 31.23 కోట్ల మందికి రూపే కార్డులు జారీ చేసినట్లు ఆర్థిక శాఖ వివరించింది. 2018 ఆగస్టు 28 తర్వాత జన్ ధన్ ఖాతా తెరిచిన వారికి రూపే కార్డకు వర్తించే ఉచిత ప్రమాద బీమా కవర్ను రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచిన విషయాన్ని గుర్తు చేసింది.
కొవిడ్ కష్టకాలంలో దేశవ్యాప్తంగా ఉన్న మహిళ జన్ ధన్ ఖాతాల్లో రూ.30,945 కోట్లు ఆర్థిక సాయం కింద జమ చేసినట్లు ఆర్థిక శాఖ వివరించింది.
ప్రధాని హర్షం..
జన్ ధన్ యోజన ఖాతాలు ఏడేళ్లలో ఈ స్థాయికి చేరుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం కోసం పని చేసిన వారందరిని అభినందించారు. భారత వృద్ధికి ఈ పథకం ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. కోట్లాది మంది భారతీయుల గౌరవానికి, సాధికారతకు భరోసా ఇచ్చినట్లు వివరించారు. ఇది పారదర్శకతను కూడా పెంచినట్లు చెప్పుకొచ్చారు.
-
Today we mark seven years of #PMJanDhan, an initiative that has forever transformed India’s development trajectory. It has ensured financial inclusion and a life of dignity as well as empowerment for countless Indians. Jan Dhan Yojana has also helped further transparency.
— Narendra Modi (@narendramodi) August 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Today we mark seven years of #PMJanDhan, an initiative that has forever transformed India’s development trajectory. It has ensured financial inclusion and a life of dignity as well as empowerment for countless Indians. Jan Dhan Yojana has also helped further transparency.
— Narendra Modi (@narendramodi) August 28, 2021Today we mark seven years of #PMJanDhan, an initiative that has forever transformed India’s development trajectory. It has ensured financial inclusion and a life of dignity as well as empowerment for countless Indians. Jan Dhan Yojana has also helped further transparency.
— Narendra Modi (@narendramodi) August 28, 2021
ఇదీ చదవండి: BH Series Registration: ఇకపై ఒకే దేశం.. ఒకే రిజిస్ట్రేషన్!