ETV Bharat / business

దేశంలో ప్రతి పెట్రోల్ బంకులో ఈవీ ఛార్జర్లు! - EV charging kiosks in india

దేశంలో సుమారు 69,000 పెట్రోల్ బంకుల్లో ఈవీ ఛార్జింగ్ కియోస్క్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది కేంద్రం. శిలాజ ఇంధన వాహనాలకు ప్రత్యామ్నాయంగా విద్యుత్ వాహనాల వినియోగం పెంచాలని భావిస్తోంది.

Govt mulls installing EV charging kiosks at around 69,000 petrol pumps in country
దేశంలో ప్రతి పెట్రోల్ బంకులో ఈవీ ఛార్జర్లు!
author img

By

Published : Sep 7, 2020, 2:54 PM IST

విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నడుంకట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 69,000 పెట్రోల్ బంకుల్లో ఎలక్ట్రిక్ వెహికిల్(ఈవీ) ఛార్జింగ్ కియోస్కులను ఏర్పాటు చేసే యోచనలో ఉంది.

ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కే సింగ్.. ఛార్జర్లు దొరకవనే ప్రజలు విద్యుత్ వాహనాలను కొనుగోలు చేయట్లేదన్నారు. అందుకే దేశంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్వహిస్తున్న అన్ని పెట్రోల్ బంకుల్లోనూ ఈవీ ఛార్జర్లను తప్పనిసరి చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు.

తొలుత కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, వడోదర, భోపాల్ వంటి మహానగరాలు, హైవేలపై ఉన్న పెట్రోల్ బంకుల్లో ఈవీ ఛార్జర్లు ఏర్పాటు చేయాలని సూచించారు సింగ్. ఇంధన ధరలు అమాంతం పెరిగిపోతున్న వేళ.. ప్రజలను విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసేలా ప్రోత్సహించాలన్నారు.

"ఓ నగరంలో ఒకటో, రెండో ఈవీ ఛార్జర్లు పెడితే అది నిధులను వృథా చేయడమే. అందుకే, అన్ని పెట్రో బంకుల్లోనూ ఈవీ కియోస్క్‌లను ఏర్పాటు చేయాలి. అప్పుడే మార్పు కనిపిస్తుంది. ఇప్పటికే కొత్తగా నిర్మిస్తున్న పెట్రోల్ బంకులు ప్రత్యామ్నాయ ఇంధన ఎంపిక కింద ఈవీ ఛార్జింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి."

- ప్రభుత్వ వర్గాలు

ఇదీ చదవండి: వొడా-ఐడియా నయా అవతారం.. టారిఫ్​ల పెంపు ఖాయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.