రాష్ట్రాల మధ్య వ్యక్తిగత వాహనాల బదిలీని సులభతరం చేసేందుకు కేంద్రం కొత్త రిజిస్ట్రేషన్ ప్రక్రియను (New vehicle registration regime) తీసుకొచ్చింది. కొత్త వాహనాలకు భారత్ సిరీస్ (BH-series) మార్క్‌తో రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు కొత్త రిజిస్ట్రేషన్ ప్రక్రియను కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది.
భారత్ సిరీస్ రిజిస్ట్రేషన్ ఉన్న వాహన యజమాని.. దేశీయంగా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మారాల్సి వస్తే.. వారి వాహనానికి స్థానికంగా రీ-రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. ఇంతకు ముందు ఒక రాష్ట్రానికి చెందిన వాహనం మరో రాష్ట్రానికి బదిలీ అయినప్పుడు 12 నెలలకు మించి అక్కడే ఉంటే.. రీ-రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండేది. ఆ సమస్యను అధిగమించేందుకే తాజాగా భారత్ సిరీస్‌ను ప్రవేశపెట్టింది కేంద్రం.
'భారత్ సిరీస్ (బీఎచ్-సిరీస్) రిజిస్ట్రేషన్.. రక్షణ సిబ్బంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు/సంస్థలకు మాత్రం ఐచ్ఛికమే. అయితే నాలుగు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలకు మాత్రమే ఇది వర్తిస్తుంది' అని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: Bank Holidays In September 2021: సెప్టెంబరులో 12 రోజులు బ్యాంకు హాలిడేస్