బంగారం ధర గురువారం స్వల్పంగా రూ.11 పెరిగింది. దీనితో దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 53,132 వద్దకు చేరింది.
అంతర్జాతీయంగా పసిడి ధరలు పెరగటం వల్ల ఆ ప్రభావం దేశీయంగా పడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు
వెండి ధర కిలోకు బుధవారం భారీగా రూ.1,554 పెరిగింది. కిలో ప్రస్తుతం రూ.68,349గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,931 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 25.88 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉంది.
ఇదీ చూడండి:పారదర్శక పన్ను విధానానికి మోదీ అంకురార్పణ