పండుగ సీజన్ డిమాండుతో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.50 వృద్ధితో.. రూ.38,810కి చేరింది. దీపావళి ముందు వచ్చే ధనత్రయోదశి(దంతెరాస్) నేపథ్యంలో నమోదవుతున్న కొనుగోళ్ల సానుకూలతే ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు అంటున్నారు.
బంగారంతో పాటే వెండి ధరలు నేడు పెరిగాయి. దిల్లీలో కిలో వెండి ధర నేడు రూ.160 పెరిగి.. రూ.46,690 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,488 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 17.64 డాలర్లకు చేరింది.
ఇదీ చూడండి: ఇన్ఫోసిస్‌కు ఏమైంది..? ఎందుకీ నష్టాలు...?