రూపాయి బలపడటం కారణంగా బంగారం ధరలు పతనమయ్యాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.162 క్షీణించింది. ప్రస్తుతం స్వచ్ఛమైన బంగారం ధర రూ.41,294కి చేరింది.
వెండి ధర సైతం రూ.657 మేర తగ్గింది. కిలో వెండి రూ.47,870కి చేరింది.
రూపాయి
నేటి ట్రేడింగ్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 6 పైసలు పుంజుకుని 71.37కి చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లలోనూ
అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం, వెండి ధరలు పడిపోయాయి. ప్రస్తుతం ఔన్సు బంగారం ధర 1,579 డాలర్లుగా.. ఔన్సు వెండి ధర 18 డాలర్లుగా ఉంది.