బంగారం ధర శుక్రవారం స్వల్పంగా పెరగగా.. వెండి ధరలో తగ్గుదల నమోదైంది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.97 వృద్ధి చెంది.. రూ.46,257కు చేరింది.
కిలో వెండి ధర రూ.275 క్షీణించి.. రూ.66,253కు తగ్గింది.
డాలరుతో పోలిస్తే రూపాయి విలువ తగ్గడమే దేశీయంగా పసిడి ధర పెరుగుదలకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,745 డాలర్లు, వెండి ధర 25.15 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: వెంటాడిన కరోనా భయాలు- మార్కెట్లకు నష్టాలు