అమెరికాకు చెందిన హెచ్డీటీ బయోటెక్ కార్పొరేషన్, పుణెకు చెందిన జెనోవా బయో ఫార్మాస్యూటికల్స్ సంయుక్తంగా తయారు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ క్యాండిడేట్పై భారత్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) షరతులతో కూడిన అనుమతులు జారీ చేసింది.
సంస్థ అభ్యర్థనను పరిశీలించి విషయ నిపుణుల కమిటీ(ఎస్ఈసీ) అందించిన సూచనల మేరకు.. ఫేజ్ 1, 2 ట్రయల్స్ నిర్వహణకు అనుమతించింది. తర్వాతి దశ ప్రయోగాలు నిర్వహించే ముందు ఫేజ్ 1 ట్రయల్స్ మధ్యంతర ఫలితాలు సమర్పించాలని ఆదేశించింది.
హెచ్డీటీ సంస్థతో కలిసి ఎంఆర్ఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్(హెచ్జీసీఓ19) అభివృద్ధి చేసింది జెనోవా సంస్థ.
ఇదీ చదవండి: కరోనా టీకాలకు త్వరలోనే అనుమతి: కేంద్రం