ETV Bharat / business

పీఎస్​యూల ప్రైవేటీకరణపై నిర్మల కీలక వ్యాఖ్యలు - nirmala sitharaman on psu disinvestment

పెట్టుబడుల ఉపసంహరణపై ప్రభుత్వం తొలిసారి స్పష్టమైన వ్యూహాన్ని రూపొందించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కుటుంబాన్ని పోషించే ఆస్తులను అమ్మేస్తున్నారని విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. కొన్ని పీఎస్​యూలు రాణించాలని ప్రభుత్వం సైతం భావిస్తోందని చెప్పారు.

FM rejects Opposition charge of 'selling family silver'; says govt wants some PSUs to do well
'పీఎస్​యూలు రాణించాలని ప్రభుత్వం సైతం భావిస్తోంది'
author img

By

Published : Feb 7, 2021, 3:51 PM IST

సంక్షోభ సమయంలో విలువైన ప్రభుత్వ ఆస్తులను కేంద్రం విక్రయిస్తోందని విపక్షాలు చేస్తున్న విమర్శలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తప్పుబట్టారు. పెట్టుబడుల ఉపసంహరణపై ప్రభుత్వం తొలిసారి స్పష్టమైన వ్యూహాన్ని రూపొందించిందని చెప్పుకొచ్చారు. తద్వారా పన్ను చెల్లింపుదారుల డబ్బును జాగ్రత్తగా ఖర్చుపెట్టే అవకాశం ఉంటుందని అన్నారు. ముంబయిలో వ్యాపారవేత్తల సమావేశంలో మాట్లాడిన నిర్మల.. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్​యూ)లు రాణించాలని కేంద్రం సైతం భావిస్తోందని చెప్పారు.

"విపక్షాలు చెబుతున్నట్లు ఇదేమీ కుటుంబాన్ని పోషిస్తున్న ఆస్తులను అమ్ముకుంటున్నట్లు కాదు. ఈ ఆస్తులను బలోపేతం చేయాలి. అదే మన బలం అవుతుంది. చాలా పీఎస్​యూలు మనుగడ సాధించే స్థితిలో లేవు. మరికొన్ని రాణించే సత్తా ఉన్నా.. సరిగా దృష్టిసారించడం లేదు. ఇలాంటి సంస్థలను ప్రభుత్వ విధానాల ద్వారా ఆదుకోవడమే మా ధ్యేయం. అవి మెరుగ్గా రాణిస్తే భారత దేశ ఆకాంక్షలు నెరవేరతాయి."

-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థికమంత్రి

ఇదే కార్యక్రమానికి హాజరైన హిందుస్థాన్ యూనిలీవర్ ఛైర్మన్, ఎండీ సంజీవ్ మెహతా.. తాజా బడ్జెట్ ఉపశమన, పునరుద్ధరణ, సంస్కరణల(రిలీఫ్, రికవరీ, రిఫార్మ్)పై దృష్టిసారించేలా ఉందని అన్నారు. 1991లో మన్మోహన్​ ప్రవేశపెట్టిన సంస్కరణలతో తాజా బడ్జెట్​ను పోల్చారు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సీఈఓ ఆశిశ్ కుమార్ చౌహాన్. ఒత్తిళ్లు లేకుండానే వీటిని చేపట్టినందున ఈ ప్రతిపాదనలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు.

ఇదీ చదవండి: కరోనా పన్ను విధింపుపై నిర్మల స్పష్టత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.