ETV Bharat / business

బంగారంపై రుణమా?.. ఇవి గుర్తుంచుకోండి

తాత్కాలికంగా నగదు సమస్య ఎదుర్కొంటున్నప్పుడు తప్ప.. ఇల్లు కొనడం వంటి పెద్ద ఖర్చులకు బంగారంపై రుణాలు తీసుకోవద్దంటున్నారు నిపుణులు. ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

Few precautions to take when loan on gold
బంగారంపై రుణమా?.. ఇవి గుర్తుంచుకోండి
author img

By

Published : Feb 20, 2021, 9:25 AM IST

తాత్కాలికంగా ఎదుర‌య్యే న‌గ‌దు స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి బంగారు రుణాలు సహాయపడతాయి. ఈ రుణాలు త్వ‌ర‌గా పొందొచ్చు. బంగారంపై రుణాల‌ను జారీచేసేందుకు బ్యాంకులు కూడా క్రెడిట్ స్కోర్‌లను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవు. బంగారంపై రుణం ఇచ్చేటప్పుడు రుణగ్రహీత తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేయవు. ఇటువంటి రుణాలు చిన్న వ్యాపార యజమానులకు తాత్కాలిక నగదు సమస్యల‌కు లేదా అత్యవసర డబ్బు అవసర‌మైన‌ప్పుడు సహాయపడతాయి. బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు) బంగారు రుణాలు అందజేస్తుంటాయి. ఎన్‌బీఎఫ్‌సీలైన మణప్పురం, ముత్తూట్ ఫైనాన్స్ వంటివి బంగారు రుణ వ్యాపారంపైనే దృష్టి సారించాయి కాబట్టి అవి త్వరగా రుణాన్ని పంపిణీ చేస్తుంటాయి.

ఎన్‌బీఎఫ్‌సీ vs బ్యాంకులు

బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల‌ మధ్య ఒక ముఖ్యమైన వ్యత్యాసం ఉంది. బ్యాంకుల తక్కువ వడ్డీ రేట్లకే రుణం మంజూరు చేస్తాయి. ఎన్‌బీఎస్‌సీలు ఎక్కువ మొత్తంలో రుణాలు ఇస్తాయి. మీ బంగారానికి బ్యాంకుల కంటే ఎన్‌బీఎస్‌సీలు ఎక్కువ విలువ కట్టడమే కారణం. ఉదాహరణకు రుణ గ్రహీత దగ్గర 20 గ్రాముల బంగారు హారం ఉందనకుందాం. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ రెండూ రుణ గ్రహీతకు బంగారం విలువలో 75 శాతం అందిస్తుంటాయి. ఒక బ్యాంక్ మీ బంగారాన్ని 10 గ్రాములకు రూ.46,500 చొప్పున విలువ కడితే, ఎన్‌బీఎఫ్ఎ‌సీ దాన్ని ఎక్కువ విలువైనదిగా పరిగణించొచ్చు. బంగారానికి రుణాలు ఇచ్చే ఎన్‌బీఎఫ్‌సీ లోహానికి విలువ ఇచ్చేటప్పుడు వేగంగా రుణాలు ఇవ్వగలదు. బ్యాంకుల విషయానికొస్తే నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి రుణాల‌ను జారీ చేస్తాయి కాబట్టి జాప్యం జరిగే అవకాశం ఉంది.

ఎలాంటి బంగారంపై ఇస్తారు..?

బంగారం కనీస స్వచ్ఛత 18 క్యారెట్లు ఉండాలి. చాలామంది రుణదాతలు ఈ స్వచ్ఛత కంటే తక్కువ బంగారాన్ని తాక‌ట్టు పెట్టుకోరు. చాలా బ్యాంకులు గోల్డ్ బార్స్‌పై రుణాలు ఇవ్వవు. ఆభరణాలు, బంగారు నాణేలను తాకట్టు పెట్టవచ్చు. అయితే త‌న‌ఖా పెట్టిన‌ప్పుడు ఆభరణాల్లో భాగమైన వజ్రాలు, రాళ్లకు విలువ ఉండ‌దనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేవలం బంగారం విలువ మాత్రమే లెక్కిస్తారు. నాణేల విషయంలో అధిక స్వచ్ఛత అడగొచ్చు. బరువుపై పరిమితులూ ఉండొచ్చు. చాలామంది 50 గ్రాముల కంటే ఎక్కువ బరువున్న నాణేలను అంగీకరించరు.

ఛార్జీలు.. చెల్లింపులు

రుణాలను తిరిగి చెల్లించడంలో చాలావ‌ర‌కు ముందస్తు చెల్లింపు ఛార్జీలు లేవు. కొన్ని బ్యాంకులు ఆ ఛార్జీలు విధిస్తున్నప్పటికీ.. రుణంలో ఒక శాతంగా మాత్ర‌మే ఉంటాయి. వాల్యుయేషన్ ఛార్జీలు, ప్రాసెసింగ్ ఫీజులు కూడా ఉండొచ్చు. రుణం తిరిగి చెల్లించే విషయంలో రకరకాల ఆప్షన్లు ఉంటాయి. నెలవారీ వాయిదాలలో (ఈఎంఐ) చెల్లించొచ్చు. లేదా రుణ కాల‌ప‌రిమితి ఉన్నంత‌వ‌ర‌కు వడ్డీని మాత్ర‌మే చెల్లించి, చివర్లో ఒకేసారి మొత్తం రుణం చెల్లించ‌వ‌చ్చు. రుణదాతలు, ముఖ్యంగా ఎన్‌బీఎఫ్‌సీలు రుణ మొత్తాన్ని పంపిణీ చేయడానికి ముందు వడ్డీ భాగాన్ని తగ్గిస్తుంటాయి.

తిరిగి చెల్లించకపోతే..?

రుణాన్ని సమయానికి తిరిగి చెల్లించలేకపోతే.. రుణదాతలకు మీ బంగారాన్ని విక్రయించే హక్కు ఉంటుంది. అలాగే, బంగారం ధర పడిపోతే, రుణదాత అదనపు బంగారాన్ని తాకట్టు పెట్టాలని మిమ్మల్ని అడగొచ్చు. రుణం- బంగారం విలువ నిష్పత్తిని ఎప్పటికప్పుడు నిబంధనల మేరకు కొనసాగించాలని బ్యాంకులు కోరుతుంటాయి. అంటే, వారి దగ్గరున్న బంగారం విలువ.. మీకు ఇచ్చిన డబ్బు కంటే ఎక్కువగా ఉండాలి.

బంగారు రుణాలు సౌకర్యవంతంగా ఉంటాయి గానీ, మీరు తాత్కాలిక నగదు ప్రవాహ సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు మాత్రమే ఎంచుకోండి. ఇల్లు కొనడం వంటి పెద్ద ఖర్చులకు నిధులు సమకూర్చడానికి తీసుకోవ‌ద్దు. రుణ చెల్లింపు గ‌డువు సాధ్యమైనంత తక్కువగా పెట్టుకోండి.

ఇదీ చూడండి: మల్టీ క్యాప్‌..ఫ్లెక్సీ క్యాప్‌..పెట్టుబడికి ఏది మేలు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.