ETV Bharat / business

పద్దు 2019: ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేనా? - భాజపా

ఆర్థిక వృద్ధి మందగమనం.. అత్యధిక నిరుద్యోగ రేటు... వ్యవసాయ సంక్షోభం.. ఇలా ఎన్నో సమస్యల మధ్యే సార్వత్రిక ఎన్నికలొచ్చాయి. ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతామన్న మోదీ హామీని ప్రజలు నమ్మారు. ఆయన నేతృత్వంలోని ఎన్డీఏకు చరిత్రలో నిలిచిపోయే మెజారిటీతో మరోసారి అధికారాన్ని కట్టబెట్టారు. ఇప్పుడు ప్రజలను సంతృప్తిపరచాల్సిన సందర్భం ప్రభుత్వం ముందుకొచ్చింది. మరి జులై 5న ప్రవేశపెట్టే బడ్జెట్​లో ప్రజలకు వరాలుండనున్నాయా..? ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే సంస్కరణలుంటాయా..? బడ్జెట్​ నుంచి సామాన్య ప్రజలు ఆశిస్తున్నదేమిటి..?

పద్దు 2019: ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేనా?
author img

By

Published : Jun 27, 2019, 6:21 PM IST

Updated : Jun 27, 2019, 6:33 PM IST

ఎన్నో సమస్యలు.. మరెన్నో సవాళ్లు... 130 కోట్ల ప్రజల ఆకాంక్షలు.. వీటన్నింటి నడుమ 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్​ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది కేంద్రం. జులై 5 ముహూర్తం. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ రెండోసారి అధికారంలోకి వచ్చాక తీసుకొస్తున్న మొదటి పద్దు కావడం వల్ల భారీ అంచనాలు ఉన్నాయి. బడ్జెట్​ ప్రజాకర్షకంగా ఉంటుందా.. సంస్కరణ బాట పడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. పూర్తిస్థాయి కేంద్ర ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా చరిత్ర సృష్టించిన నిర్మలా సీతారామన్ మొదటి పరీక్షను ఎదుర్కోబోతున్నారు.

ఆశల పల్లకిలో..

ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్​లో మోదీ ప్రభుత్వం అనేక ప్రజాకర్షక నిర్ణయాలు తీసుకుంది. మధ్య తరగతి వర్గాలకు ఊరటనిచ్చే పన్ను రిబేటు పెంపు లాంటివి ప్రకటించింది. రైతు సంక్షేమం కోసం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది. ఈ బడ్జెట్​లోనూ కొత్త పథకాలతో పాటు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు చోటుంటుందని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న పన్ను మినహాయింపు స్థాయిని రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని ప్రజలు కోరుతున్నారు. బడ్జెట్ స్లాబులనూ ప్రభుత్వం తగ్గిస్తుందని ఆశిస్తున్నారు.

గత బడ్జెట్ సందర్భంగా కిసాన్ సమ్మాన్ నిధిని కేవలం చిన్న, మధ్య తరహా రైతులకే వర్తింపజేశారు. ఒక్కో రైతుకు వార్షికంగా రూ.6వేలు ఇచ్చే ఈ పథకాన్ని రైతులందరికీ వర్తింపజేయాలని రెండోసారి అధికారంలోకి వచ్చాక నిర్వహించిన తొలి కేబినెట్​ సమావేశంలోనే నిర్ణయించింది మోదీ ప్రభుత్వం. ఈ మొత్తాన్ని పెంచాలన్నది రైతుల ఆశ. ఎన్డీఏ కీలక హామీ అయిన రైతు ఆదాయం రెట్టింపు కోసం చర్యలు తీసుకుంటారని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

అధిగమించేనా..?

2018-19లో భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధి 5.8 శాతానికి పడిపోయింది. ఆర్థిక మందగమనాన్ని అధిగమించి వ్యవస్థను పరుగులు పెట్టించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఆర్థిక మంత్రి ముందు ఉన్న అతిపెద్ద సవాల్ ఇదే​.

బ్యాంకింగ్ వ్యవస్థలో నిరర్ధక ఆస్తులు పేరుకుపోతున్నాయి. విపణిలో వినియోగ గిరాకీ పడిపోతోంది. దీని ప్రభావం పారిశ్రామిక రంగంపై తీవ్రంగా పడుతోంది. ప్రైవేటు పెట్టుబడులు, ఎగుమతుల్లో సానుకూలత తగ్గిపోతోంది. వీటన్నింటినీ ఆర్థిక మంత్రి సమర్థంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

నిరుద్యోగం నుంచి గట్టెక్కేనా..?

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగం. దేశంలో నిరుద్యోగ రేటు 45 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. కోట్లాది మంది యువత ఉపాధి కోసం వేచి చూస్తున్నారు. ఈ తరుణంలో నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు బడ్జెట్​లో సమర్థమైన చర్యలు తీసుకోవాలని దేశం మొత్తం ఆశిస్తోంది. ఉద్యోగాల సృష్టి, పరిశ్రమల స్థాపనకు ఊతమిచ్చే విధానాలను తీసుకురావాలని కోరుతోంది. ప్రభుత్వం సైతం బడ్జెట్​లో ఆ దిశగా చర్యలు తీసుకునే అవకాశముంది. సాంకేతికత వల్ల ఉద్యోగాలు కోల్పోతున్నామన్న ఆందోళనలను దూరం చేయాల్సిన బాధ్యత సర్కార్​పై ఉంది.

మౌలిక వసతులపై రూ.100 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని ఎన్డీఏ హామీ ఇచ్చింది. అందుకు తగినట్లు ఈ బడ్జెట్​లో ఏమేరకు కేటాయింపులు ఉంటాయన్నది ఆసక్తికరం.

అంచనాలివే..

ఈ ఏడాది ఫిబ్రవరిలో పియూష్​ గోయల్ ప్రవేశపెట్టిన బడ్జెట్​కు ప్రస్తుత మంత్రి సీతారామన్​ పెద్దమార్పులేమీ చేసే అవకాశాలు లేవు. అయితే ఇటీవలి అంచనాలు, సంప్రదింపుల నేపథ్యంలో కొన్ని కొత్త నిర్ణయాలు వెలువడొచ్చు. ముఖ్యంగా అధిక శాతం మంది డిమాండ్​ చేస్తున్న ఆదాయపు పన్ను నిబంధనల్లో మార్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే సంస్కరణలు వచ్చే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:

క్యాబ్​ దారి తప్పితే మోతే... గూగుల్​ కొత్త యాప్

2019 కేంద్ర బడ్జెట్​.. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందా..?

AP Video Delivery Log - 0900 GMT Horizons
Thursday, 27 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0321: HZ Portugal Smiley AP Clients Only 4217033
Raving about smiley - Fatboy Slim's collection on display
AP-APTN-0321: HZ US Everglades UNESCO AP Clients Only 4217664
World Heritage site remains on 'in danger' list
AP-APTN-1517: HZ UK Heavy Metal No access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4217667
New exhibition celebrates the godfathers of heavy metal
AP-APTN-1447: HZ France Best Restaurant AP Clients Only 4147797
French restaurant named as 'World's best' +REPLAY+
AP-APTN-1218: HZ US Moon Landing Apollo Rocks AP Clients Only 4217632
Space secrets - NASA to open moon rock samples for first time
AP-APTN-1059: HZ Italy Bulgari AP Clients Only 4217621
Bulgari jewelry and the glamourous women in Rome's past
AP-APTN-1049: HZ UK Selfie Plant AP Clients Only 4217616
Selfie-taking plant documents own growth
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jun 27, 2019, 6:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.