ETV Bharat / business

'కరోనా వ్యాప్తి నియంత్రణలో భారత్‌ భేష్‌'

పాశ్చాత్య దేశాలతో పోలుస్తే భారత్​లో కరోనా కేసులను అంచనా వేయలేమని బయోకాన్ సీఎండీ కిరణ్​ మజుందార్ షా అన్నారు. ఐరోపా, అమెరికాలతో పోలిస్తే భారత్​లో కరోనా తీవ్రత తక్కువగా ఉందని.. నియంత్రణలోనూ చాలా ముందున్నట్లు తెలిపారు. కరోనాపై అమె తెలిపిన మరిన్ని అంశాలు ఇలా ఉన్నాయి.

India fighting In a Right way on corona
కరోనా కట్టడిలో భారత్​ పనితీరు భేష్
author img

By

Published : May 3, 2020, 6:40 AM IST

ఐరోపా, అమెరికాలతో పోలుస్తూ భారత్‌లోనూ జూన్‌-జులైల్లో కరోనా వైరస్‌ మరింత విస్తరిస్తుందంటూ అంచనాలు వేయడం ఏమాత్రం సరికాదని అంటున్నారు బయోకాన్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా. ఆ దేశాలతో పోలిస్తే భారత్‌లోని పరిస్థితులు భిన్నంగా ఉండటమే ఇందుకు కారణమని చెప్పారు. కరోనా వ్యాప్తి పరిమితంగా ఉన్నప్పుడే లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించడం భారత్‌కు మేలు చేసిందని అన్నారు. కఠిన చర్యలు, ముందస్తు జాగ్రత్తలతో కరోనా వ్యాప్తి నియంత్రణలో ఏ దేశానికీ అందనంత దూరంలో నిలిచామని తెలిపారు. ఆయా అంశాలపై ఏమన్నారో ఆమె మాటల్లోనే..

భారత్‌ సమర్థంగా నియంత్రించింది..

ఐరోపా దేశాలు, అమెరికాలో నమోదైన కొవిడ్‌-19 కేసుల గణాంకాల ఆధారంగా భారత్‌లో నమోదయ్యే కేసులపై అంచనాకు రావడం సరికాదు. సామాజిక నిర్మాణం విషయంలో పాశ్చాత్య దేశాలకు, భారత్‌కు తేడా ఉంది. ఇతర దేశాల కంటే కూడా కరోనా వ్యాప్తిని ఇప్పటివరకు భారత్‌ సమర్థంగా నియంత్రించింది. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 500 ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రభుత్వం ప్రకటించింది. అదే ఇటలీలో 9000, బ్రిటన్‌లో 6,700 కేసులున్నప్పుడు లాక్‌డౌన్‌ ఆంక్షలను విధించారు. ఈ గణాంకాల ప్రకారం చూస్తే ఈ దేశాలు లాక్‌డౌన్‌ విధించినప్పుడు కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉందనే విషయం అర్థం చేసుకోవచ్చు. భారత్‌లో మాత్రం ఆ స్థాయిలో లేదు. అంతేకాదు.. కరోనా వ్యాప్తి నియంత్రణకు భారత్‌ పలు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఉదాహరణకు క్వారంటైన్‌, కర్ఫ్యూ, లాక్‌డౌన్‌, నిఘా, కఠిన ఆంక్షల అమలు లాంటివి. చాలా దేశాలు ఇలాంటి చర్యలేవీ చేపట్టలేదు. ప్రాథమిక దశలోనూ ఎటువంటి అలక్ష్యాన్ని భారత్‌ ప్రదర్శించలేదు. అందుకే ఈ విషయంలో భారత్‌ను మనం అభినందించాలి.

పోలీసుల పాత్ర అద్భుతం..

లాక్‌డౌన్‌ ఆంక్షలను కఠినంగా అమలు చేయడంలో పోలీసుల పాత్ర కూడా అద్భుతం. ఇలా కఠినమైన చర్యలు, ముందు జాగ్రత్తలు తీసుకొని కరోనా వ్యాప్తి నియంత్రణలో ఏ దేశానికీ అందనంత దూరంలో నిలిచిన భారత్‌ను ఐరోపా, అమెరికాలతో పోల్చి కేసుల సంఖ్యను అంచనా వేయడం సబబేనా? పాశ్చాత్య దేశాల్లో ఇళ్లల్లో చనిపోయిన వృద్ధుల సంఖ్యను ఓ సారి చూడండి. చాలా చాలా ఎక్కువ. ఇటలీ కావచ్చు లేదా బ్రిటన్‌, ఫ్రాన్స్‌ కావచ్చు.. ఐరోపాలోని ఏ దేశమైనా చూడండి. ఎంత మంది వృద్ధులు వాళ్ల ఇళ్లలో మరణించారో గమనించండి. భారత్‌లో అటువంటి పరిస్థితి లేదు. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో వృద్ధుల మరణాలు ఇక్కడ చోటుచేసుకోలేదు. అందుకే పాశ్చాత్య దేశాల్లోని పరిస్థితుల ఆధారంగా చేసుకొని వేస్తున్న లెక్కలను, అంచనాలను నేను అంగీకరించడం లేదు.

జిల్లా అధికారులకే వదిలేయాలి..

జిల్లా మొత్తాన్ని రెడ్‌ జోన్‌గా వర్గీకరించడం కంటే చిన్న చిన్న రెడ్‌ జోన్లను ఏర్పాటు చేయడం మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే జిల్లాలు విస్తీర్ణపరంగా పెద్దవిగా ఉంటాయి. రెడ్‌ జోన్లు చిన్నవిగా ఉంటే ఆర్థిక ప్రగతి పుంజుకోవడమే కాకుండా.. సరఫరా అవరోధాలు తగ్గించినట్లు అవుతుంది. ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్ల విషయంలోనూ ఇదే పద్ధతి పాటిస్తే మేలు. కొవిడ్‌-19కి సంబంధించిన నిర్వహణను జిల్లా అధికారులకు వదిలేయాలి. పరీక్షలు చేయడం దగ్గర నుంచి కరోనా లక్షణాలున్న వారిని గుర్తించడం, క్వారంటైన్‌ చేయడం, చికిత్స అందించడం వరకు అన్ని బాధ్యతలను వాళ్లకే అప్పగించాలి. ఇలా చేయడం వల్ల కరోనా వైరస్‌ వ్యాప్తిని వేగంగా నియంత్రించడమే కాకుండా, ప్రభావ తీవ్రతకు అడ్డుకట్ట వేయొచ్చు. దీంతో పాటు ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలో ఆర్థిక కార్యకలాపాలు తక్షణమే ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలి.

ఇదీ చూడండి:కరోనాపై బిల్​ గేట్స్ వీడియో​: వ్యాక్సిన్​ ఎలా పని చేస్తుందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.