ప్రపంచమంతా మునుపటిలా సాధారణ జీవితం తిరిగి పొందాలంటే కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనుగొనడమే మన ముందున్న ఏకైక మార్గమని చెప్పారు సాఫ్ట్వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్. వైరస్‌ను నిలువరించేందుకు పరిశోధకులు కొన్ని ఔషధాలనుు పరీక్షిస్తున్నప్పటికీ.. వ్యాక్సిన్ మాత్రమే కచ్చితమైన ప్రభావం చూపుతుందని తెలిపారు. కరోనాపై వ్యాక్సిన్ ఏ విధంగా పని చేస్తుందనే విషయంపై ప్రత్యేక వీడియో రూపొందించారు బిల్ గేట్స్. ఇదే వీడియోను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 115 రకాల వ్యాక్సిన్లపై పరిశోధనలు జరుగుతున్నట్లు వివరించారు గేట్స్. వీటిలో కనీసం 10 వ్యాక్సిన్లు మెరుగైన ఫలితాలు ఇవ్వొచ్చన్నారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా వ్యాక్సిన్ అభివృద్ధికి తమవంతు సాయంగా నిధులు సమకూరుస్తున్నారు.
-
There are over 100 different coronavirus vaccine candidates in the works. These candidates take a variety of approaches to protecting the body against COVID-19: https://t.co/sFTGWFLgIq pic.twitter.com/9iPgeIzG1E
— Bill Gates (@BillGates) May 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">There are over 100 different coronavirus vaccine candidates in the works. These candidates take a variety of approaches to protecting the body against COVID-19: https://t.co/sFTGWFLgIq pic.twitter.com/9iPgeIzG1E
— Bill Gates (@BillGates) May 1, 2020There are over 100 different coronavirus vaccine candidates in the works. These candidates take a variety of approaches to protecting the body against COVID-19: https://t.co/sFTGWFLgIq pic.twitter.com/9iPgeIzG1E
— Bill Gates (@BillGates) May 1, 2020
" ప్రస్తుతమున్న ఔషధాలు అంతశక్తిమంతం కాదు. ఇవి రోగుల ప్రాణాలను మాత్రమే కాపాడగలవు. మనం గతంలా సాాధారణ జీవితాన్ని పొందాలంటే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలి. కొన్ని కోట్ల డోసులను సిద్ధం చేసి ప్రపంచం నలుమూలలకు చేరేలా చేయాలి. ఇందుకు ఎంత లేదన్నా కనీసం 9నెలల నుంచి రెండేళ్ల సమయం పడుతుంది. కనీసం 70 శాతం ప్రభావం చూపగలిగే వ్యాక్సిన్‌తో కరోనాను నియంత్రించవచ్చు. కనీసం 60శాతం ప్రభావం చూపినా సరిపోతుంది కానీ స్థానికంగా వైరస్ వ్యాప్తి చెందే అవకాశముంది. 60 శాతం లోపు ప్రభావం చూపే వ్యాక్సిన్‌తో కరోనాను కట్టడి చేయలేం. వైరస్‌ను నిలువరించాలంటే ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందుబాటులో ఉంచాలి. రెండు డోసులు ఇవ్వాల్సి వస్తే ఆ సంఖ్య రెట్టింపవుతుంది."
-బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు