పెరుగుతున్న కాలుష్యంతో పర్యావరణహిత వాహనాలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. విద్యుత్ వాహనాల వినియోగాన్ని ఎక్కువ చేసేందుకు కేంద్రం ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నాయి. తాజాగా దేశంలో విద్యుత్ వాహనాలతో రెండు సంస్థలు ముందుకు వచ్చాయి. చైనాకు చెందిన హువాహాయ్, భారత్కు చెందిన కీర్తి సోలార్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి.
దిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెండు సంస్థలు ఆరు రకాల విద్యుత్ వాహనాలను ఆవిష్కరించాయి. ద్విచక్ర వాహనాలతో పాటు మూడు చక్రాల ఆటో రిక్షాలను మార్కెట్ లోకి విడుదల చేశాయి. కోల్కతాలోని కేఎస్ఎల్కు ప్లాంట్ నుంచి ఏడాదికి 10 వేల వాహనాల ఉత్పత్తితో పాటు... రానున్న రెండున్నరేళ్లలో మరో పది రకాల కొత్త మోడల్స్ వాహనాలను తీసుకురావాలని హూవాహాయ్, కేఎస్ఎల్ భావిస్తున్నాయి.
ఇదీ చూడండి: పారిశ్రామిక వృద్ధిపై ఆందోళన.. 11 వేల దిగువకు నిఫ్టీ