కరోనా కట్టడికి దివ్య ఔషధంగా భావిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ కోసం ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్న వేళ... మన దేశంలో సరిపడినన్ని నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఔషధం కొరత ఏర్పడకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపింది.
దేశీయ అవసరాల కోసం కోటి మాత్రలు అవసరమని... అయితే మొత్తం 3.28 కోట్ల మేర హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధం నిల్వఉందని స్పష్టం చేశారు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి.
వివిధ దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఎగుమతి చేస్తున్నప్పటికీ భారత్‌లో తగినంత నిల్వ ఉందని అవసరాలకు అనుగుణంగా వీటిని ఉత్పత్తి చేస్తున్నామని ఔషధ ఉత్పత్తి సంస్థలు పేర్కొంటున్నాయి. దేశానికి సరిపడా ఔషధాలను సరఫరా చేసిన తరువాతనే ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నామని తెలిపాయి. ప్రపంచ వ్యాప్తంగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఉత్పత్తిలో భారత్ 70 శాతం వాటా కలిగి ఉంది.
ఇదీ చూడండి:ఈపీఎఫ్ చందాదారులకు రూ.280 కోట్లు చెల్లింపు