దేశవ్యాప్త లాక్‌డౌన్ వేళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెలుసుబాటు మేరకు.. లక్షా 37 వేల మంది చందాదారుల నగదు ఉపసంహరణ అభ్యర్థనల్ని పరిష్కరించినట్లు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ)ప్రకటించింది. వీరందరికీ కలిపి మొత్తం రూ.280 కోట్లు చెల్లించినట్లు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది.
పూర్తి కేవైసీ సదుపాయం ఉన్న చందాదారులకు అభ్యర్థనను 72గంటల్లోనే పరిష్కరిస్తున్నట్లు పేర్కొంది. ఇతర కేటగిరీల్లో దరఖాస్తు చేసుకున్న వారి అభ్యర్థనలనూ వీలైనంత త్వరగా పరిష్కరించే యత్నం చేస్తున్నట్లు కేంద్ర కార్మికశాఖ వివరించింది.
భారీ సంఖ్యలో నగదు ఉపసంహరణ ఎందుకు?
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద భవిష్యనిధి ఖాతాలోని 75 శాతం లేదా 3 నెలల వేతనంలో ఏది తక్కువ ఉంటే అది తీసుకునేందుకు కేంద్రం అనుమతించింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఉద్యోగులు ఇబ్బంది పడకుండా ఈ సౌకర్యాన్ని కల్పించింది.
ఇదీ చూడండి:కరోనా ఎఫెక్ట్: ఆ విమానాల్లో ఇక భోజనాలు బంద్