వార్తలను ప్రసారం చేస్తున్నందుకు ఫేస్బుక్, గూగుల్, యూట్యూబ్... వార్తా సంస్థలకు డబ్బులు చెల్లించేలా ఆస్ట్రేలియా తరహాలో చట్టం తేవాలని భాజపా ఎంపీ సుశీల్ కుమార్ మోదీ కోరారు. ఈ మేరకు శూన్యగంటలో రాజ్యసభలో ప్రభుత్వానికి విన్నవించారు.
"ఫేస్బుక్, గూగుల్, యూట్యూబ్ సంప్రదాయ మీడియా, ఇతరేతర వార్తా సంస్థలు రాసిన వార్తల్ని ప్రసారం చేసుకుంటున్నాయి. తద్వారా వచ్చే ఆదాయంతో ఆ సామాజిక మాధ్యమ సంస్థలే లబ్ధి పొందుతున్నాయి. ఫలితంగా వార్తా సంస్థలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇప్పటికే కొవిడ్ వల్ల సంప్రదాయ మీడియా విపరీతంగా నష్టపోయింది. ఇప్పుడు ఫేస్బుక్, గూగుల్.. వార్తలను ప్రసారం చేసుకోవడం వల్ల నష్టపోతున్నాయి. వెంటనే వార్తా సంస్థలకు ఫేస్బుక్, గూగుల్ డబ్బులు చెల్లించేలా చట్టాన్ని తేవాలి."
-సుశీల్ కుమార్ మోదీ, రాజ్యసభ ఎంపీ(భాజపా)
మోదీ సూచన పరిగణనలోకి తీసుకోదగినదని రాజ్యసభ ఛైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు అన్నారు.
ఇవీ చదవండి: