ETV Bharat / business

'కొవిడ్ తర్వాత 85 లక్షల ఉద్యోగాలు పెరిగాయ్‌' - భారత్​లో నిరుద్యోగిత రేటు

2021,సెప్టెంబరులో మొత్తం ఉద్యోగాలు 85 లక్షలు పెరిగినందువల్ల నిరుద్యోగ రేటు 6.9 శాతానికి పరిమితమైనట్లు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ(సీఎమ్‌ఐఈ) విడుదల చేసిన నెలవారీ గణాంకాలు చెబుతున్నాయి. ఆగస్టు కన్నా సెప్టెంబరులోనే నిరుద్యోగిత రేటు భారీగా తగ్గిందని సర్వేలో తేలింది.

employment rate
నిరుద్యోగ రేటు
author img

By

Published : Oct 6, 2021, 5:43 AM IST

కరోనా అనంతరం భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా రికవరీ బాట పడుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబరు 2021లో మొత్తం ఉద్యోగాలు 85 లక్షలు పెరగడంతో నిరుద్యోగ రేటు 6.9 శాతానికి పరిమితమైంది. కరోనా ప్రారంభంలో అంటే మార్చి 2020న ఇది 20 శాతంగా ఉంది. ఈ ఏడాది ఆగస్టులో 8.3 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు సెప్టెంబరులో మరింత తగ్గడం విశేషం. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ(సీఎమ్‌ఐఈ) విడుదల చేసిన నెలవారీ గణాంకాల ప్రకారం.. కరోనాకు ముందునాటి ఫిబ్రవరి 2020 తర్వాత అత్యుత్తమ ఉద్యోగ గణాంకాలు ఇవే.

  • సెప్టెంబరులో వేతన ఉద్యోగాలు ఆగస్టుతో పోలిస్తే 70 లక్షలు పెరిగి, మొత్తం ఉద్యోగాలు 7.71 కోట్ల నుంచి 8.41 కోట్లకు చేరాయి. 2019-20 సగటు 8.67 కోట్ల వేతన ఉద్యోగాలు కావడం గమనార్హం.
  • సెప్టెంబరులో రైతుల సంఖ్య 25.1 లక్షలు తగ్గి 11.36 కోట్లకు పరిమితమైంది. ఆగస్టులో వీరి సంఖ్య 11.6 కోట్లుగా ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వారు వ్యవసాయేతర ఉపాధికి వెళ్లడం ఇందుకు నేపథ్యం.
  • చిన్న వ్యాపారాలు, రోజు కూలీ కార్యకలాపాలు ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబరులో 12.85 కోట్ల నుంచి 13.40 కోట్లకు చేరాయి.
  • గత నెలలో సంఘటిత, అసంఘటిత తయారీ రంగ ఉద్యోగాలు 29 లక్షల మేర పెరిగాయి. ఆహార పరిశ్రమ(25 లక్షలు), లోహ(15 లక్షలు) రంగాల్లోనూ ఎక్కువ ఉద్యోగాలే జత అయ్యాయి. ఫార్మా, పాద రక్షలు, రత్నాభరాణాలు, చేతివృత్తులలోనూ ఎంచదగ్గ రీతిలోనే ఉద్యోగాలు వృద్ధి చెందాయి.

ఇదీ చదవండి: సెప్టెంబర్​లోనూ సేవా రంగం జోరు- ఉపాధి అవకాశాలు మెరుగు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.