ETV Bharat / business

వేతనాల చెల్లింపు వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు - wages cut employers

ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వేతనాలు చెల్లించాలన్న కేంద్రం ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. లాక్‌డౌన్ సమయంలో పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లించని సంస్థలపై చర్యలు తీసుకోవద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను ఈ నెల12 వరకూ పొడిగిస్తున్నట్లు తెలిపింది.

Employer
వేతనాల చెల్లింపు
author img

By

Published : Jun 4, 2020, 4:30 PM IST

కరోనా లాక్​డౌన్ సమయంలో కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించాలని ప్రైవేటు సంస్థలను ఆదేశిస్తూ చేసిన ప్రకనటను సుప్రీంకోర్టులో సమర్థించుకుంది కేంద్రం. జీతాలు చెల్లించే సమర్థత లేదని పేర్కొన్న యజమానులు ఆడిట్ చేసిన తమ బ్యాలెన్స్ షీట్లు, ఖాతాలను కోర్టులో సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది కేంద్రం.

లాక్​డౌన్​ కాలంలో ఉద్యోగులు, కార్మికుల ఆర్థిక ఇబ్బందులను తగ్గించడానికి పూర్తి వేతనాలు చెల్లించాలంటూ మార్చి 29న కేంద్రం తాత్కాలిక ఆదేశాలిచ్చింది. వీటిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.

తీర్పు రిజర్వు..

ఈ వ్యాజ్యాలకు సంబంధించి సంబంధించి ఇరు వర్గాల వాదనలు పూర్తయ్యాయి. కేంద్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. ఉద్యోగులు, కార్మికుల ఆర్థిక ఇబ్బందులు తొలగించేందుకు తాత్కాలిక చర్యలు తీసుకున్నామని తెలిపింది.

వ్యాజ్యాలకు సంబంధించి తీర్పును రిజర్వు చేసింది సుప్రీంకోర్టు. లాక్‌డౌన్ సమయంలో పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లించని సంస్థలపై చర్యలు తీసుకోవద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను ఈ నెల12 వరకూ పొడిగిస్తున్నట్లు తెలిపింది.

చర్యలు తీసుకోవద్దని..

ఈ వ్యాజ్యాలపై విచారణ నిర్వహించిన జస్టిస్ అశోక్‌ భూషణ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎంఆర్​ షాలతో కూడిన ధర్మాసనం లాక్‌డౌన్ కాలంలో పూర్తిస్థాయిలో వేతనాలు చెల్లించలేదన్న కారణంగా సంస్థలు, యాజమాన్యాలపై చర్యలు తీసుకోవద్దని గతంలో కేంద్రాన్ని ఆదేశించింది.

జీతాలు చెల్లించకుండా ఉద్యోగులు, కార్మికులను వదిలివేయకూడదన్న కోర్టు... అదే సమయంలో చెల్లించేందుకు సంస్థలు, పరిశ్రమల వద్ల సరిపడా డబ్బు లేకపోవచ్చని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో రెండింటి మధ్య సమతుల్యం తీసుకురావాల్సిన అవసరముందని పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.