రాణించిన ఐటీ, ఆటో షేర్లు
స్టాక్ మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 95 పాయింట్లు తగ్గి 38,991 వద్దకు చేరింది. నిఫ్టీ స్వల్పంగా 7 పాయింట్లు తగ్గి 11,527 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది.
ఐటీ షేర్ల సానుకూలతలో ఆరంభంలో కాస్త సానుకూలంగా స్పందించిన సూచీలు మిడ్ సెషన్ తర్వాత ఒడుదొడుకుల్లోకి జారుకున్నాయి. మొత్తం మీద గురువారం సెషన్లో బ్యాంకింగ్ షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఐటీ, ఆటో షేర్లు రాణించాయి.
- టైటాన్, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, మారుతీ, ఏషియన్ పెయింట్స్, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
- ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, పవర్‌గ్రిడ్, కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.