ETV Bharat / business

'పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకుంటాం' - 'ఈ సంవత్సరం ముందుగానే పెట్టుబడుల ఉపసంహరణ'

2021-22 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం లక్షా 75వేల కోట్లను తొందరగానే చేరుకునే అవకాశం ఉందని ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతిపాదిత ఎల్‌ఐసీ ఐపీఓ ద్వారానే లక్ష కోట్లు కేంద్రానికి సమకూరుతాయని అంచనా వేశారు.

Disinvestment target of FY'22 achievable; LIC IPO to bring in Rs 1 lakh cr: CEA
'ఈ సంవత్సరం ముందుగానే పెట్టుబడుల ఉపసంహరణ'
author img

By

Published : Mar 27, 2021, 8:20 PM IST

2021-22 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం లక్షా 75వేల కోట్లను తొందరగానే చేరుకునే అవకాశాలున్నట్లు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కేవి సుబ్రమణియన్ అభిప్రాయపడ్డారు. జనస్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వర్చువల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన.. ప్రతిపాదిత ఎల్‌ఐసీ ఐపీఓ ద్వారానే లక్ష కోట్లు కేంద్రానికి సమకూరుతాయని అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 2.10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ఉపసంహరణకు కొనసాగింపుగానే వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1.75 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు కేవీ సుబ్రమణియన్ తెలిపారు.

బీపీసీఎల్‌ ప్రైవేటీకరణ, ఎల్‌ఐసీ ఐపీవో ముఖ్యమైనవిగా పేర్కొన్న సుబ్రమణియన్ బీపీసీఎల్‌ ప్రైవేటీకరణ ద్వారా 75 నుంచి 80వేల కోట్లు,ఎల్​ఐసీ ఐపీవో ద్వారా లక్ష కోట్ల వరకూ సమకూరే అవకాశమున్నట్లు అంచనా వేశారు.

ఇదీ చదవండి : 'భారత్​లో సెప్టెంబర్​ నాటికి 'కొవొవాక్స్‌' టీకా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.