ETV Bharat / business

'బీమా కావాలనే అవగాహన ప్రజల్లో పెరిగింది' - బజాజ్​ అలయంజ్​ లైఫ్​ ఇన్సూరెన్స్​

కరోనా సంక్షోభం వల్ల ప్రజల్లో రిస్కుపై అవగాహన గణనీయంగా పెరిగిందని బజాజ్​ అలియంజ్​ లైఫ్​ ఇన్సూరెన్స్​ ఎండీ తరుణ్​ ఛుగ్​ వెల్లడించారు. దీంతో బీమా పాలసీలపై ఆసక్తి​ పెరిగిందన్నారు. 6 నెలల్లో టర్మ్​ పాలసీలను అధికంగా కొన్నారని వివరించారు.

demand-for-term-insurance-policies-increased-says-bajaj-alliance-life-md
'ప్రజల్లో బీమా కావాలనే అవగాహన పెరిగింది'
author img

By

Published : Nov 17, 2020, 6:22 AM IST

కరోనా మహమ్మారి వల్ల ప్రజల ఆలోచనా ధోరణి బాగా మారిందని, రిస్కుపై అవగాహన పెరిగిందని బజాజ్‌ అలియంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ - సీఈఓ తరుణ్‌ ఛుగ్‌ అన్నారు. కుటుంబానికి ఆర్థిక భద్రత ముఖ్యమనే ఆలోచన అందరిలో వచ్చిందని, దీంతో శక్తిమేరకు బీమా పాలసీలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని వివరించారు. గత 6 నెలల్లో టర్మ్‌ పాలసీలను అధికంగా కొనుగోలు చేశారని వివరించారు. కొవిడ్‌ పరిణామాల వల్ల ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగైదు నెలల్లో కార్యకలాపాల నిర్వహణ, వినియోగదార్లను కలవడం కష్టమైందని, ఈ ప్రభావం జీవిత బీమా వ్యాపారంపై పడినట్లు తెలిపారు. క్రమంగా సాధారణ స్థితిగతులు నెలకొంటున్నందున, ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంతో కొంత వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని 'ఈనాడు-ఈటీవీ భారత్' ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. విశేషాలు:

కొవిడ్‌- 19 వల్ల జీవిత బీమా పరిశ్రమకు ఎదురైన సవాళ్లు ఏమిటి?

ఊహించని విధంగా కరోనా వ్యాప్తి, నిరోధానికి లాక్‌డౌన్‌ అమల్లోకి రావటంతో ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందారు. ఖర్చులు తగ్గించుకుని, డబ్బు చేతిలో ఉంచుకోవడం అవసరంగా భావించారు. దీంతో బీమా పాలసీల విక్రయాలు తగ్గాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో బీమా కంపెనీల ఆదాయాలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. అయినా బీమా కంపెనీలు ప్రజలకు అవసరమైన కొత్త తరహా పాలసీలను ఆవిష్కరించాయి. వ్యాపారం కూడా ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటల్‌ విధానాల వైపు చూడటం తప్పనిసరా?

కొవిడ్‌-19 తీసుకువచ్చిన మార్పుగా దీన్ని చూడొచ్చు. డిజిటల్‌ విధానాల వినియోగం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ మహమ్మారి వల్ల పూర్తిస్థాయిలో డిజిటల్‌ వైపు మారాల్సి వచ్చింది. అండర్‌రైటింగ్‌, వినియోగదార్లతో సమావేశాలు, పాలసీ సేవలు.. తదితర పనులను ఆన్‌లైన్లో నిర్వహించాల్సి వచ్చింది. వినియోగదార్లు కూడా ఆన్‌లైన్లో పాలసీలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

మీ 'డిజిటల్‌' సన్నద్ధత ఏవిధంగా ఉంది?

పరిస్థితులకు తగ్గట్లుగా మేం మారిపోతున్నాం. ముఖ్యంగా డిజిటల్‌ కాంటాక్ట్‌ పాయింట్లను పెంచుకున్నాం. 'స్మార్ట్‌ అసిస్ట్'’ కస్టమర్‌ పోర్టల్‌ ఆవిష్కరించాం. దీనివల్ల వినియోగదార్లతో ఆన్‌లైన్లో మాట్లాడి మా ఉత్పత్తుల ప్రత్యేకతలను వివరించే అవకాశం ఏర్పడింది. వినియోగదార్లు కూడా డిజిటల్‌ ఛానల్‌్్సను బాగా వినియోగించుకుంటున్నారు. ఉదాహరణకు చాట్‌బాట్‌, యాప్‌లపై లావాదేవీలు 89 శాతం పెరిగాయి. లాక్‌డౌన్‌ సమయంలో మేం ఆవిష్కరించిన వాట్సాప్‌ సేవలను 5 లక్షల మంది వినియోగించుకున్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో జీవిత బీమా కంపెనీలు వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందా?

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలల్లో లావాదేవీలు, వ్యాపారం సజావుగా సాగలేదు. ఆ తర్వాత కొత్త పాలసీలు అధికంగా అమ్ముడయ్యాయి. మొదటి ప్రీమియం ఆదాయాలు మెరుగ్గా నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి బజాజ్‌ అలియంజ్‌ జీవిత బీమా కంపెనీ 9 శాతం వృద్ధి నమోదు చేసింది. వినియోగదార్ల సంఖ్య 45 శాతం వరకు పెరిగింది. కానీ ఎక్కువ మంది టర్మ్‌ పాలసీలు కొనుగోలు చేయటం వల్ల, ఒక్కో బీమా పాలసీపై వసూలయ్యే ప్రీమియం మొత్తాలు తక్కువగా ఉన్నాయి. ముందుముందు అన్ని రకాల పాలసీలకు గిరాకీ పెరగొచ్చు. ఎండోమెంట్‌, మనీబ్యాక్‌ వంటి గ్యారెంటీడ్‌ ప్లాన్స్‌ తీసుకునేందుకు వినియోగదార్లు ముందుకు వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంతో కొంత వృద్ది నమోదవుతుంది.

ఎటువంటి పాలసీలు తీసుకోవటానికి వినియోగదార్లు అధికంగా ఆసక్తి చూపుతున్నారు?

ప్రజల్లో రిస్కుపై అవగాహన గణనీయంగా పెరిగింది. దీనివల్ల టర్మ్‌ పాలసీలు తీసుకోవటానికి ఎక్కువ మంది ముందుకు వస్తున్నారు. తద్వారా తమ కుటుంబానికి, తమపై ఆధారపడిన వారికి ఆర్థిక భద్రత లభిస్తుందని విశ్వసిస్తున్నారు. కొంత సొమ్ము వెనక్కి వచ్చేలా రాబడి హామీ పాలసీలు (గ్యారెంటీడ్‌ ప్లాన్స్‌) కొనే వాళ్ల సంఖ్యా ఎక్కువగానే ఉంది. జీవిత బీమా మార్కెట్‌ ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకుంటోంది. దీనివల్ల మళ్లీ ‘యులిప్స్‌’ కొనే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.