కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్ తుది డేటాను భారత్ బయోటెక్ విడుదల చేసింది. కొవిడ్‌పై తమ టీకా 77.8 శాతం సమర్థంగా పనిచేస్తున్నట్లు ప్రకటించింది. కొవిడ్ తీవ్ర లక్షణాలు రాకుండా 93.4 శాతం అడ్డుకుంటుందని స్పష్టం చేసింది.
డెల్టా వేరియంట్‌పై 65.2 శాతం ప్రభావం చూపుతుందని భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా తెలిపారు. కొవాగ్జిన్ తీవ్ర లక్షణాలు నిలువరించి హాస్పిటలైజేషన్ తగ్గిస్తోందని పేర్కొన్నారు.