ETV Bharat / business

కరోనా భయంతో భారీగా తగ్గుతున్న ఇంధన వినియోగం

కరోనా ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాపిస్తోన్న వేళ ఇంధన వినియోగం తగ్గనుందని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ నివేదించింది. 2009 తర్వాత తొలిసారిగా రోజుకు 90 వేల బ్యారెళ్ల మేర ఇంధన వినియోగం తగ్గుతుందని అంచనా వేసింది.

fuel consumption
ఇంధనం
author img

By

Published : Mar 9, 2020, 5:40 PM IST

ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్​ ప్రభావం ఇంధన వినియోగంపై పడుతోందని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ) వెల్లడించింది. వందకుపైగా దేశాలకు కరోనా వ్యాపించిన వేళ ఇంధన వినియోగం పదేళ్లలో తొలిసారిగా తగ్గబోతున్నట్లు ఐఈఏ నివేదికలో పేర్కొంది.

కరోనా విస్తరణ కారణంగా చాలా దేశాల్లో ప్రజల జీవనం స్తంభించిపోతోంది. 2009 తర్వాత తొలిసారిగా రోజుకు 90 వేల బ్యారెళ్ల మేర ఇంధన వినియోగం తగ్గుతుందని అంచనా వేసింది ఐఈఏ. 2019 ఫిబ్రవరితో పోలిస్తే 2020 ఫిబ్రవరిలో ఇంధన వినియోగం 42 లక్షల బ్యారెళ్ల మేర తగ్గినట్లు అంచనా వేసింది.

చైనాలోనే అధికం..

ప్రపంచంలో అత్యధికంగా ఇంధనాన్ని వినియోగిస్తున్న చైనాలో కరోనా కేంద్రబిందువుగా మారింది. హుబే వంటి ప్రాంతాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ కారణాలతో ఇంధన వినియోగం తగ్గుతుందని ఐఈఏ వివరించింది.

ఇదీ చూడండి: దలాల్​ స్ట్రీట్​ ఢమాల్​- సెన్సెక్స్​ రికార్డు పతనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.