ETV Bharat / business

కార్వీ డీమ్యాట్‌ ఖాతాలు ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ చేతికి - పింఛన్‌ చెల్లింపులు

ఐఐఎఫ్‌ఎల్‌, యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ చేతికి.. కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ వినియోగదార్లకు చెందిన డీమ్యాట్‌, ట్రేడింగ్‌ ఖాతాలు వెళ్లనున్నాయి. బిడ్డింగ్‌ విధానంలో పాల్గొని ఐఐఎఫ్‌ఎల్‌, యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ డీమ్యాట్‌, ట్రేడింగ్‌ ఖాతాలు సొంతం చేసుకున్నాయి.

carvey
కార్వీ డీమ్యాట్‌ ఖాతాలు ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ చేతికి
author img

By

Published : Feb 25, 2021, 7:11 AM IST

కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ వినియోగదార్లకు చెందిన డీమ్యాట్‌, ట్రేడింగ్‌ ఖాతాలు ఐఐఎఫ్‌ఎల్‌, యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ చేతికి వెళ్లిపోనున్నాయి. కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌కు ఉన్న ట్రేడింగ్‌, డీమ్యాట్‌ ఖాతాలను ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ, ఎంఎస్‌ఈ విక్రయానికి పెట్టిన విషయం తెలిసిందే. దీని ప్రకారం బిడ్లు ఆహ్వానించగా వివిధ బ్రోకరేజీ సంస్థలు పోటీ పడ్డాయి. బిడ్డింగ్‌ విధానంలో పాల్గొని ఐఐఎఫ్‌ఎల్‌, యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ డీమ్యాట్‌, ట్రేడింగ్‌ ఖాతాలు సొంతం చేసుకున్నాయి. తాము 11.06 లక్షల డీమ్యాట్‌ ఖాతాలు దక్కించుకున్నట్లు ఐఐఎఫ్‌ఎల్‌ వెల్లడించింది. ఇందులో సీడీఎస్‌ఎల్‌ వద్ద ఉన్న 3.82 లక్షల ఖాతాలు, ఎన్‌ఎస్‌డీఎల్‌ వద్ద ఉన్న 7.23 లక్షల ఖాతాలు ఉన్నాయి. ఈ ఖాతాల 'కస్టడీ విలువ' రూ.3.01 లక్షల కోట్లుగా ఐఐఎఫ్‌ఎల్‌ వివరించింది. దీంతో ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ వద్ద ఉన్న డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య 13.8 లక్షలకు పెరుగుతోంది. తద్వారా జెరోధా, ఆర్‌కేఎస్‌వీ సెక్యూరిటీస్‌ తర్వాత అతిపెద్ద సంస్థగా ఐఐఎఫ్‌ఎల్‌ నిలుస్తుంది. ప్రస్తుతం జెరోధా దాదాపు 31.43 లక్షల డీమ్యాట్‌ ఖాతాలతో దేశంలో అతిపెద్ద స్టాక్‌బ్రోకింగ్‌ సంస్థగా ఉంది. అప్‌స్టాక్స్‌ వద్ద 18.53 లక్షల ఖాతాలు ఉన్నాయి.
అదే విధంగా దాదాపు 11 లక్షల ట్రేడింగ్‌ ఖాతాలను కార్వీ నుంచి యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ సొంతం చసుకుంది. దీంతో యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ వద్ద ఉన్న ట్రేడింగ్‌ ఖాతాదార్ల సంఖ్య 25 లక్షల నుంచి 36 లక్షలకు పెరుగుతోంది. తమ ఖాతాదార్లకు ఇప్పటి వరకూ అందిస్తున్న సేవలన్నింటినీ కొత్తగా తమవద్దకు వచ్చే కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ ట్రేడింగ్‌ ఖాతాదార్లకు లభిస్తాయని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది. కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ ఖాతాదార్లకు చెందిన ట్రేడింగ్‌, డీమ్యాట్‌ ఖాతాలను ఇతర బ్రోకింగ్‌ సంస్థలకు బదిలీ చేయాలని ఈ నెల ప్రారంభంలో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ, మెట్రోపాలిటన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ(ఎంఎస్‌ఈ) నిర్ణయించాయి. దీని ప్రకారం ఈ మార్పు జరిగింది.
గ్రాన్యూల్స్‌ 'మైగ్రేన్‌' ఔషధానికి అమెరికాలో అనుమతి
అసిటామినోఫెన్‌, ఆస్ప్రిన్‌, కెఫిన్‌ మిశ్రమ ట్యాబ్లెట్‌ను అమెరికాలో విక్రయించటానికి గ్రాన్యూల్స్‌ ఇండియా అనుమతి సంపాదించింది. దీనిపై దాఖలు చేసిన ఏఎన్‌డీఏ (అబ్రీవియేటెడ్‌ న్యూ డ్రగ్‌ అప్లికేషన్‌) దరఖాస్తును అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్‌ఎఫ్‌డీఏ) ఆమోదించినట్లు గ్రాన్యూల్స్‌ ఇండియా వెల్లడించింది. జీఎస్‌కే కన్సూమర్‌ హెల్త్‌కేర్‌కు చెందిన ఎక్సెడ్రిన్‌ మైగ్రేన్‌ ట్యాబ్లెట్‌కు ఇది జనరిక్‌ ఔషధం. 250ఎంజీ/250ఎంజీ/65ఎంజీ డోసులో ఈ జనరిక్‌ ట్యాబ్లెట్‌తో త్వరలో యూఎస్‌లో విడుదల చేయనున్నట్లు గ్రాన్యూల్స్‌ పేర్కొంది. దీంతో కలిపి యూఎస్‌ మార్కెట్లో ఈ కంపెనీకి చెందిన 38 ఔషధాలకు ఏఎన్‌డీఏ అనుమతులు ఉన్నట్లు అవుతోంది.
ప్రభుత్వ సంబంధిత వ్యాపారాల్లో పాల్గొనేందుకు అన్ని ప్రైవేట్‌ బ్యాంకులకు అనుమతి
పన్నుల వసూలు, పింఛన్‌ చెల్లింపులు, చిన్న మొత్తాల పొదుపు పథకాలు వంటి ప్రభుత్వ సంబంధిత వ్యాపారాల్లో పాల్గొనేందుకు అన్ని ప్రైవేట్‌ రంగ బ్యాంకులకు ఆర్థిక శాఖ బుధవారం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం కొన్ని భారీ ప్రైవేటు బ్యాంకులకు మాత్రమే వీటిని నిర్వహించేందుకు అనుమతి ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో ఖాతాదారులకు సౌలభ్యం, పోటీ పెరుగుతుందని.. వినియోగదారుల సేవల ప్రమాణాలు మెరుగుపడతాయని ఆర్థిక శాఖ తెలిపింది. ఇక భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ప్రైవేట్‌ బ్యాంకులకు సైతం సమానపాత్ర ఉంటుందని, ప్రభుత్వ సామాజిక రంగ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ట్వీట్‌ చేశారు. తాజాగా ప్రైవేట్‌ రంగ బ్యాంకులపై ఆంక్షలు ఎత్తివేయడంతో.. ప్రైవేటు బ్యాంకులు ఆర్‌బీఐ సహా ప్రభుత్వ సంస్థల అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆర్‌బీఐకి ఇప్పటికే ఈ నిర్ణయాన్ని తెలియజేసినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.

ఇదీ చూడండి: సామాజిక మాధ్యమాలకు కొత్త నియమావళి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.