ETV Bharat / business

కొవిడ్‌-19 చికిత్సకు హెపటైటిస్‌-సి ఔషధం!

హెపటైటిస్‌-సి ఔషధాన్ని (పెగలేటేడ్‌ ఇంటర్‌ఫెరాన్‌ ఆల్ఫా-2బి) కొవిడ్​-19 చికిత్సకు అనుమతించాలని క్యాడిలా హెల్త్‌కేర్ సంస్థ.. భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతి కోరింది. ఈ ఔషధానికి కొవిడ్‌-19 వ్యాధిని అదుపు చేసే సత్తా ఉన్నట్లు క్లినికల్‌ పరీక్షల్లో నిర్ధరణ అయిందని కంపెనీ ఎండీ శార్విల్‌ పటేల్‌ వెల్లడించారు.‌

cadila seeks nod to repurpose hepatitis-c drug for covid-19 in india
కొవిడ్‌-19 చికిత్సకు హెపటైటిస్‌-సి ఔషధం!
author img

By

Published : Apr 6, 2021, 7:17 AM IST

కొవిడ్‌-19 వ్యాధి వచ్చిన వారికి చికిత్సలో హెపటైటిస్‌-సి ఔషధాన్ని (పెగలేటేడ్‌ ఇంటర్‌ఫెరాన్‌ ఆల్ఫా-2బి) వినియోగించడానికి అనుమతి ఇవ్వాలని భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ)ని దేశీయ ఫార్మా కంపెనీ క్యాడిలా హెల్త్‌కేర్‌ కోరింది. ఈ ఔషధానికి కొవిడ్‌-19 వ్యాధిని అదుపు చేసే సత్తా ఉన్నట్లు క్లినికల్‌ పరీక్షల్లో నిర్థారణ అయిందని కంపెనీ వెల్లడించింది. హెపటైటిస్‌-సి ఔషధాన్ని క్యాడిలా హెల్త్‌కేర్‌ 'పెగిహెప్‌' బ్రాండు పేరుతో విక్రయిస్తోంది. కొవిడ్‌-19 వ్యాధి సోకిన వారికి తొలిదశలో ఈ ఔషధాన్ని ఇచ్చినప్పుడు వారు త్వరగా కోలుకోవడమే కాకుండా, కొవిడ్‌-19 వ్యాధి తీవ్రత హెచ్చినప్పుడు కనిపించే ఇతర ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురుకాలేదని ఫేజ్‌-3 పరీక్షల్లో నిర్థారణ అయినట్లు క్యాడిలా హెల్త్‌కేర్‌ పేర్కొంది.

"ఈ ఔషధాన్ని తీసుకున్న కొవిడ్‌-19 రోగుల్లో దాదాపు 91% మందికి 7వ రోజున ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష చేస్తే, 'నెగిటివ్‌' రిజల్ట్​ వచ్చింది'

-- క్యాడిలా హెల్త్‌కేర్

ఈ ఔషధాన్ని తీసుకుంటున్న రోగుల్లో శ్వాసకోశ ఇబ్బందులు తగ్గుముఖం పట్టడంతో పాటు, కృత్రిమంగా ఆక్సిజన్‌ తీసుకోవాల్సిన అవసరం కూడా తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ఈ సానుకూల ఫలితాలతో అనుమతి కోసం దరఖాస్తు చేసినట్లు వివరించింది. ఈ మందుపై ఫేజ్‌-3 క్లినికల్‌ పరీక్షలను దేశవ్యాప్తంగా 250 మంది రోగులపై నిర్వహించారు. ఫలితాలు ఎంతో సానుకూలంగా వచ్చినట్లు క్యాడిలా హెల్త్‌కేర్‌ ఎండీ శార్విల్‌ పటేల్‌ పేర్కొన్నారు. దీనిపై మెక్సికోలో ఫేజ్‌-2 పరీక్షలు నిర్వహిస్తున్నామని, అమెరికాలోనూ పరీక్షల నిర్వహణకు యూఎస్‌ఎఫ్‌డీఏతో కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు.

పెగలేటేడ్‌ ఇంటర్‌ఫెరాన్‌ ఆల్ఫా-2బి మందును హెపటైటిస్‌-సి (కాలేయ వ్యాధి) కి చికిత్సలో వినియోగించడానికి మనదేశంలో పదేళ్ల క్రితం అనుమతి ఇచ్చారు. దీన్ని కొవిడ్‌-19 వ్యాధికి చికిత్సలో వినియోగించడానికి వీలుగా క్యాడిలాహెల్త్‌కేర్‌ 'రీ-పర్పస్‌' చేసి అనుమతి కోసం దరఖాస్తు చేసింది.

ఇదీ చదవండి : ఒకే పాఠశాలలో 99 మంది విద్యార్థులకు కరోనా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.