ETV Bharat / business

మార్చి 1 నుంచి 4జీ సేవలకు బీఎస్​ఎన్​ఎల్ శ్రీకారం! - మార్చి 1 నుంచి 4జీ సేవలకు బీఎస్​ఎన్​ఎల్ శ్రీకారం?

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్​ఎన్ఎల్ దేశవ్యాప్తంగా​ మార్చి 1 నుంచి 4జీ సేవలు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. చౌకైన డేటా ప్లాన్లతో బీఎస్​ఎన్​ఎల్​ ముందుకొస్తే.. జియో, ఎయిర్​టెల్​, వొడాఫోన్, ఐడియాలకు గట్టి షాక్ తగిలే అవకాశం ఉంది.

BSNL 4G Likely to Launch on March 1
మార్చి 1 నుంచి 4జీ సేవలకు బీఎస్​ఎన్​ఎల్ శ్రీకారం?
author img

By

Published : Jan 19, 2020, 9:20 AM IST

Updated : Jan 19, 2020, 9:43 AM IST

భారత్​ సంచార్​ నిగమ్ లిమిటెడ్​ (బీఎస్​ఎన్​ఎల్) 4జీ సేవలు దేశవ్యాప్తంగా మార్చి 1 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పబ్లిక్ సర్వీస్​ అండర్ టేకింగ్స్ (పీఎస్​యూ) ఈ అంశంపై ఇప్పటికే టెలికాం శాఖను సంప్రదించింది.

బీఎస్​ఎన్​ఎల్​ ప్రస్తుతం కొన్ని పరిమిత సర్కిళ్లలో 3జీ స్పెక్ట్రం ఉపయోగించి 4జీ సేవలను అందిస్తోంది. కానీ మార్చి నుంచి 4జీ సేవలు పూర్తిస్థాయిలో అందించడానికి సన్నాహాలు చేస్తోంది. హైఎండ్ బేసిక్​ ట్రాన్స్ రిసీవర్ స్టేషన్లు (బీటీఎస్​) ద్వారా ఈ సేవలు అందించనుంది.

4జీ ప్లాన్లు?

మార్చి 1 నుంచి 4జీ సేవలు అందుబాటులోకి వస్తే.. అందుకు తగ్గ నూతన ప్లాన్లలను కూడా అప్పుడే తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అత్యంత చౌకగా డేటా ప్లాన్లు అందిస్తున్నది బీఎస్​ఎన్​ఎల్​ మాత్రమే. 4జీ డేటా కూడా అంతే చౌకగా ఇస్తే.. వినియోగదారులకు అది బెస్ట్ ఛాయిస్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఫుల్​స్వింగ్​లో బీఎస్​ఎన్​ఎల్​

భారత టెలికాం ఆపరేటర్లలో రిలయన్స్​ జియో 37 కోట్ల మంది చందాదారులతో ప్రథమస్థానంలో ఉంది. ఎయిర్​టెల్ తరువాతి స్థానంలో ఉంది. ప్రస్తుతం బీఎస్ఎన్​ఎల్​కు 12 కోట్ల మంది సబ్​స్క్రైబర్స్ ఉన్నారు. ఒకసారి 4జీ సేవలు ప్రారంభమైతే ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. లీడింగ్​లో ఉన్న జియో, ఎయిర్​టెల్​, వొడాఫోన్, ఐడియాలకు గట్టి షాక్ తగిలే అవకాశమూ లేకపోలేదు.

ఇదీ చూడండి: '5 ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యం కష్టమే కానీ.. అసాధ్యం కాదు'

Intro:Body:Conclusion:
Last Updated : Jan 19, 2020, 9:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.