దేశంలో అమ్ముడయ్యే ద్విచక్రవాహనాల్లో బడ్జెట్ బైక్‌లదే ప్రథమ స్థానం. ధరతో పాటు అధిక మైలేజ్ ఉండటమే దీనికి కారణం. ఈ సెగ్మెంట్లో అన్ని కంపెనీల మోడళ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ.. కొన్ని మాత్రమే పాపులర్ అయ్యాయి.
రూ.లక్ష లోపు బైక్‌లను పరిగణనలోకి తీసుకున్నట్లయితే హీరో మోటార్స్‌కు సంబంధించినవే ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ సెగ్మెంట్లో హీరో తర్వాతి స్థానం హోండా, బజాజ్ బైక్‌లదే. రూ.లక్ష లోపు ఎక్కువగా విక్రయం అవుతున్న బైక్‌లు, వాటి ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
హీరో స్ల్పెండర్ ప్లస్
భారత్‌లోనే కాకుండా ప్రపంచంలోనూ అత్యధికంగా విక్రయం అవుతున్న బైక్‌గా దీనికి చరిత్ర ఉంది. ఇందులో స్ల్పెండర్ ప్లస్, స్ల్పెండర్ ఐస్మార్ట్, సూపర్ స్ల్పెండర్ మోడళ్లు ఉన్నాయి. ఏప్రిల్ 2020- జనవరి 21 మధ్య 19.32 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి.
ఫీచర్లు ఇవే..
ఇంజిన్: 97.2 సీసీ, సింగిల్ సిలిండర్
మైలేజ్: 63 కిలోమీటర్లు/లీటర్
ట్రాన్స్మిషన్: 4 స్పీడ్
ట్యాంక్ సామర్థ్యం: 9.8 లీటర్లు
ధర: రూ.76,036
హీరో హెచ్ఎఫ్ డీలక్స్
దేశీయంగా ఎక్కువగా విక్రయమవుతున్న టాప్ మోడళ్లలో ఇది ఒకటి. ఏప్రిల్ 2020- జనవరి 2021 మధ్య 13.90 లక్షల హెచ్ఎఫ్ డీలక్స్‌లు అమ్ముడయ్యాయి.
ఫీచర్లు ఇవే...
ఇంజిన్: 97.2 సీసీ, సింగిల్ సిలిండర్
మైలేజ్: 65 కిలోమీటర్లు/లీటర్
ట్రాన్స్మిషన్: 4 స్పీడ్
ట్యాంక్ సామర్థ్యం: 9.6 లీటర్లు
ధర: రూ. 67,319
హోండా షైన్
హోండా నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ ఇది. ఏప్రిల్ 2020- జనవరి 2021 మధ్య 7.54 లక్షల బైక్‌లు విక్రయమయ్యాయి.
ఫీచర్లు...
ఇంజిన్: 124 సీసీ
మైలేజ్ : 55 కిలోమీటర్లు/లీటర్
ట్రాన్స్మిషన్: 5 స్పీడ్
ట్యాంక్ సామర్థ్యం: 10.5 లీటర్లు
ధర: రూ. 87,406
బజాజ్ పల్సర్
బజాజ్‌కు సంబంధించి విక్రయాలపరంగా ఇది టాప్ మోడల్. ఏప్రిల్ 2020- జనవరి 2021 మధ్య 7.7 లక్షల యూనిట్లు విక్రయమయ్యాయి. పల్సర్ 125, పల్సర్ 150, 150 నియాన్, 150 ట్విన్ ఇలా పలు మోడళ్లు ఉన్నాయి. 125సీసీకి సంబంధించిన ఫీచర్లు ఓసారి పరిశీలిస్తే..
ఇంజిన్: 124.4సీసీ
మైలేజ్: 50.5 కిలోమీటర్లు
ట్రాన్స్మిషన్: 5 స్పీడ్
ట్యాంక్ సామర్థ్యం: 11.5 లీటర్లు
ధర: రూ.95,005
హీరో ప్యాషన్ ప్రో
దేశీయంగా దీనికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇది చాలా కాలం నుంచి కొనసాగుతున్న మోడల్. ఏప్రిల్ 2020-జనవరి 2021 మధ్య 4.22 లక్షల యూనిట్లు విక్రయమయ్యాయి.
ఫీచర్లు...
ఇంజిన్: 110సీసీ
మైలేజ్: 60 కిలోమీటర్లు
ట్రాన్స్మిషన్: 4 స్పీడ్
ట్యాంక్ సామర్థ్యం: 10 లీటర్లు
ధర: రూ.82,552
బజాజ్ ప్లాటినా
బజాజ్ కంపెనీకి సంబంధించి కమ్యూటర్ సెగ్మెంట్లో మంచి విక్రయాలను ఈ మోడల్ నమోదు చేస్తోంది. ఈ మోడల్ బైక్‌లు ఏప్రిల్ 2020- జనవరి 2021 మధ్య 3.36 లక్షలు విక్రయమయ్యాయి.
ఫీచర్లు..
ఇంజిన్: 102 సీసీ
మైలేజ్: 75 కిలోమీటర్లు
ట్రాన్స్మిషన్: 4 స్పీడ్
ట్యాంక్ సామర్థ్యం: 11 లీటర్లు
ధర: రూ. 64,179
హీరో గ్లామర్
విక్రయాలపరంగా హీరో మోటార్ సైకిల్స్‌కు ఇది ప్రధానమైన మోడల్. ఏప్రిల్ 2020- జనవరి 2021 మధ్య 4.03 లక్షల విక్రయాలను నమోదు చేసింది.
ఫీచర్లు ఇవే..
ఇంజిన్: 124.7సీసీ
మైలేజ్: 55 కిలోమీటర్లు
ట్రాన్స్మిషన్: 5 స్పీడ్
ట్యాంక్ సామర్థ్యం: 10 లీటర్లు
ధర: రూ. 89,475
ఇదీ చూడండి: BMW electric Bike: ఒకసారి ఛార్జింగ్‌తో 130 కిమీ ప్రయాణం