ETV Bharat / business

ఎస్​బీఐ తదుపరి ఛైర్మన్​గా దినేశ్​ కుమార్​!

భారతీయ స్టేట్​ బ్యాంకు తదుపరి ఛైర్మన్​గా దినేశ్​ కుమార్​ ఖారాను బ్యాంక్స్ బోర్డు బ్యూరో సిఫార్సు చేసింది. అక్టోబర్​ 7తో ప్రస్తుత ఛైర్మన్​ రజనీశ్ కుమార్​ పదవీకాలం ముగిసిన తర్వాత దినేశ్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

BIZ-SBI- CHAIRMAN
దినేశ్​ కుమార్​ ఖారా
author img

By

Published : Aug 28, 2020, 10:56 PM IST

దేశంలో అతిపెద్ద రుణదాత భారతీయ స్టేట్ బ్యాంకు తదుపరి ఛైర్మన్​గా దినేశ్​ కుమార్ ఖారా పేరును ప్రతిపాదించింది బ్యాంక్స్ బోర్డు బ్యూరో (బీబీబీ). ప్రస్తుత ఛైర్మన్​ రజనీశ్ కుమార్​ మూడేళ్ల పదవీకాలం అక్టోబర్​ 7తో ముగియనుంది. ఆయన అనంతరం సీనియర్​ ఎండీ దినేశ్​ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

ఇందుకోసం ఎస్​బీఐలోని నలుగురు మేనేజింగ్​ డైరెక్టర్లకు ముఖాముఖి నిర్వహించింది బీబీబీ. పనితీరు, ఇతర అనుభవాలను పరిగణనలోకి తీసుకుని దినేశ్​ పేరును ఖరారు చేశాయి. మరో ఎండీ చల్లా శ్రీనివాసులు శెట్టిని రిజర్వ్​ జాబితాలో పెట్టింది.

తుదినిర్ణయం అప్పుడే..

బీబీబీ సిఫార్సును కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది ఎస్​బీఐ. అనంతరం ఛైర్మన్​ ఎంపికపై ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేబినెట్​ నియామకాల కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది.

2017లోనూ ఛైర్మన్​ పదవి రేసులో దినేశ్​ కూడా ఉన్నారు. 2016 ఆగస్టులో ఎస్​బీఐ మేనేజింగ్ డైరెక్టర్​గా నియమితులయ్యారు దినేశ్. పనితీరు ఆధారంగా మరో రెండేళ్లు పొడిగించారు.

ఇదీ చూడండి: బ్యాంకులకు ఆర్​బీఐ గవర్నర్​ కీలక సూచనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.