ETV Bharat / business

సిరి: బ్యాంక్​ ఖాతాల్లో సగటు నిల్వ.. సంగతేంటీ? - పొదుపు ఖాతాదారులు నెలవారీ సగటు నిల్వ, కనీస నిల్వ

మీకు పొదుపు ఖాతా ఉందా? అయితే అందులో నెలవారీ సగటు నిల్వ (మంత్లీ యావరేజ్‌ బ్యాలెన్స్‌) ఉండేలా చూసుకుంటున్నారా? ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులన్నీ కూడా నెలవారీ సగటు నిల్వ లేకపోతే అపరాధ రుసుము విధిస్తున్నాయి. చాలామంది పొదుపు ఖాతాదారులు నెలవారీ సగటు నిల్వ, కనీస నిల్వ ఈ రెండింటికీ మధ్య తేడా తెలియక ఇబ్బంది పడుతుంటారు. అసలు బ్యాంకులు ఈ నిల్వలను ఎలా గణిస్తాయి.. అపరాధ రుసుము భారం పడకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.

average-storage-in-bank-accounts
సిరి: బ్యాంక్​ ఖాతాల్లో సగటు నిల్వ.. సంగతేంటీ?
author img

By

Published : Feb 20, 2020, 6:01 AM IST

Updated : Mar 1, 2020, 10:09 PM IST

బ్యాంకులు పొదుపు ఖాతాదారులకు సేవ చేసినందుకు ప్రతిఫలంగా ఏదో ఒక ప్రయోజనం ఉండాలని కోరుకుంటాయి. అందుకే, అవి ఈ ఖాతాల్లో నెలవారీ సగటు నిల్వ ఉండాలనే నిబంధనను విధిస్తుంటాయి. ఈ నిల్వ వల్ల బ్యాంకులకు చేతిలో కొంత నగదు కనిపిస్తుంటుంది. రోజువారీ బ్యాంకింగ్‌ లావాదేవీల నిర్వహణకు ఇదే కీలకం కూడా. సాధారణంగా బ్యాంకులు, ఆ శాఖలు ఉన్న ప్రాంతాలను బట్టి ఈ నెలవారీ సగటు నిల్వ రూ.1,000 నుంచి రూ.10,000 వరకూ ఉంటుంది. (వేతన ఖాతాలు ప్రత్యేకం) ఈ సగటు నిల్వను ఎలా లెక్కిస్తారు అనేది కూడా చాలామందికి సందేహమే..

ఒక నెల రోజుల వ్యవధిలో ప్రతి రోజూ చివర ఉన్న నిల్వను లెక్కలోకి తీసుకుంటారు. ఈ మొత్తాన్ని అంతా కూడుతారు. ఇలా వచ్చిన మొత్తాన్ని ఆ నెలలో ఉన్న రోజులతో భాగించినప్పుడు నెలవారీ కనీస నిల్వ ఎంత అన్నది తెలుస్తుంది. బ్యాంకు పనిదినాలతో ఇక్కడ సంబంధం ఉండదు.

దీన్ని సులభంగా అర్థం చేసుకునేందుకు ఒక ఉదాహరణ పరిశీలిద్దాం..

మీకు పొదుపు ఖాతా ఉన్న బ్యాంకులో నెలవారీ సగటు నిల్వ రూ.5,000 ఉండాలని నిబంధన ఉందనుకుందాం. నెలలో మొదటి రోజు బ్యాంకు ఖాతాలో రూ.7,000 ఉన్నాయి. ఐదో తేదీన రూ.3,000 తీసుకున్నారు. 20నాడు రూ.10,000 జమ చేశారు.. ఇప్పుడు..దీ 1-4వ తేదీ వరకూ రూ.7,000×4=రూ.28,000

* 5-19వ తేదీ వరకూ రూ.4,000×15=రూ.60,000

* 20-31వ తేదీ వరకూ రూ.14,000×12= 1,68,000

నెలవారీ సగటు నిల్వ = రూ.28,000+రూ.60,000+రూ.1,68,000/31 (నెలలో 31 రోజులు ఉన్నాయని అనుకుందాం) = 2,56,000/31= రూ.8,258.06

మీ బ్యాంకు పొదుపు ఖాతాలో నెలవారీ సగటు నిల్వ రూ.8,258.06 ఉన్నట్లు లెక్క. కాబట్టి, ఎలాంటి రుసుములు వర్తించవు.

రుసుములు ఉంటాయి...

నెలవారీ సగటు నిల్వ నిర్వహించని ఖాతాలపై అపరాధ రుసుము విధించే అధికారం బ్యాంకులకు ఉంది. కనీస నిల్వ లేనప్పుడు నగరాల్లో రూ.15 వరకూ ఉంటే.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని శాఖల్లో రూ.12 వరకూ అపరాధ రసుము విధిస్తున్నారు.

-నవీన్​ చందాని, సీబీడీఓ, బ్యాంక్​బజార్​.కాం

ఏం చేయాలి?

నెలవారీ కనీస నిల్వను నిర్వహించలేని సందర్భాలు ఉన్నప్పుడు.. సున్నా నిల్వ ఖాతాలను ప్రారంభించడం ఉత్తమం. ఇది ప్రాథమిక పొదుపు ఖాతా. దీంతోపాటు ప్రధానమంత్రి జన్‌ ధన్‌ పథకంలో కూడా సున్నా నిల్వ ఖాతాలను ప్రారంభించే ప్రయత్నం చేయవచ్చు.

బ్యాంకు ఖాతాను ప్రారంభించేప్పుడే అందులో ఎంత నెలవారీ కనీస నిల్వ ఉండాలన్న విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. బ్యాంకులను బట్టి, నెలవారీ సగటు నిల్వ లెక్క ప్రారంభ, ముగింపు తేదీలు మారుతుంటాయి. ఈ విషయం కూడా బ్యాంకును అడిగి తెలుసుకోవాలి. ఖాతాలో కనీస నిల్వ లేనప్పుడు సందేశం వచ్చేలా ఏర్పాటు చేసుకోండి. దీనివల్ల అనవసరమైన రుసుముల భారం తప్పుతుంది.

ఇదీ చూడండి:'మంత్రి కోర్టుకు వస్తారా?.. వివరణ ఇస్తారా?

Last Updated : Mar 1, 2020, 10:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.