ETV Bharat / business

కొత్త సంవత్సరం నుంచి ఏటీఎం ఛార్జీల పెంపు

Atm Transaction Charges: ఏటీఎం నుంచి పరిమితికి మించి ట్రాన్సాక్షన్​లు జరిపితే రూ.21 అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. 2022 జనవరి 1నుంచి ఇది అమలులోకి వస్తుంది. అటు.. చిన్న పొదుపు స్కీంలపై నాల్గవ త్రైమాసికానికి వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు కేంద్రం తెలిపింది.

atm transaction charges from 1 jan 2022
ఏటీఎం
author img

By

Published : Dec 31, 2021, 10:38 PM IST

Atm Transaction Charges: ఏటీఎం నుంచి పరిమితికి మించి లావాదేవీలు జరిపితే వినియోగదారులకు ఇకనుంచి అధిక భారం పడనుంది. పరిమితి తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్​కు జనవరి 1 నుంచి రూ.21 చెల్లించాల్సి ఉంటుంది. నగదు, నగదు రహిత లావాదేవీలకు ఈ నియమం వర్తిస్తుంది. ఏటీఎంల నిర్వహణ ఖర్చులు పెరిగిన కారణంగా ఈ మేరకు పెంచినట్లు ఆర్​బీఐ తెలిపింది. ఇప్పటివరకు రూ.20 వసూలు చేశారు.

ATM Transaction New Rules: ప్రతి వినియోగదారుడు ప్రతినెల ఐదు ఉచిత ట్రాన్సాక్షన్స్​ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇతర బ్యాంకు ఏటీఎంల నుంచి మెట్రో నగరాల్లో మరో మూడు, నాన్​- మెట్రో నగరాల్లో ఐదు ట్రాన్సాక్షన్​లు చేసుకోవచ్చు.

వడ్డీరేట్లు యథాతథం..

Interest Rates On Small Savings Schemes: చిన్న పొదుపు పథకాలపై వడ్డీరేట్లను నాల్గవ త్రైమాసికానికి(2021-2022) యథాతథంగా ఉంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. పీపీఎఫ్, ఎన్​ఎస్​సీ స్కీంల వడ్డీ రేట్లు ఎప్పటిలాగే 7.1 శాతం, 6.8 శాతం ఉండనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి, ద్రవ్యోల్భణం పెరుగుదల కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

ఉత్తర్​ప్రదేశ్​తో సహా ఉత్తరాఖండ్​, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, గోవా ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని నిపుణులు భావిస్తున్నారు. నాల్గవ త్రైమాసికం 2022 జనవరి 1నుంచి 2022 మార్చి 31 వరకు ఉంటుంది.

ఇదీ చదవండి: Financial Changes 2022: ఈ ఆర్థిక మార్పులకు సిద్ధమవ్వండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.