ETV Bharat / business

డిస్నీ పార్కుల్లో 28 వేల ఉద్యోగాల కోత

author img

By

Published : Oct 5, 2020, 12:32 PM IST

డిస్నీ పార్కుల్లో ఉద్యోగాల కోతకు సిద్ధమైన ఆ సంస్థ.. ఫ్లోరిడా విభాగం నుంచే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 28 వేల మందిని తొలగించాలని భావిస్తుండగా.. 3,360 మంది ఫ్లోరిడా నాన్-యూనియన్ ఉద్యోగులే ఉన్నట్లు సంస్థ రాసిన లేఖలో వెల్లడైంది. కరోనా ప్రభావంతోనే ఈ తొలగింపులు చేపడుతోంది డిస్నీ.

At least a quarter of Disney layoffs coming from Florida
ఫ్లోరిడా విభాగం నుంచే డిస్నీ ఉద్యోగాల కోతలు

డిస్నీ పార్కుల్లో ఉద్యోగాల కోతకు రంగం సిద్ధమైంది. దాదాపు 28 వేల మందిని తొలగించాలని యోచిస్తున్నట్లు డిస్నీ ఇదివరకే ప్రకటించింది. ఇందులో పావుశాతం ఫ్లోరిడా డివిజన్ నుంచే ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక అధికారులకు సంస్థ రాసిన లేఖలో ఈ విషయం స్పష్టమైంది.

డిసెంబర్​ కన్నా ముందే ఫ్లోరిడాలోని 3,360 మంది నాన్-యూనియన్ ఉద్యోగులను తొలగించనున్నట్లు డిస్నీ సంస్థ తన లేఖలో పేర్కొంది. వాల్ట్ డిస్నీ వరల్డ్ సంస్థలోని 43 వేల మంది ఉద్యోగులకు ప్రాతినిథ్యం వహిస్తున్న యూనియన్లతో సంస్థ చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మూడింట రెండో వంతు పార్ట్​టైమ్ ఉద్యోగులు, రోజువారీ కార్మికులు ఉన్నారని సంస్థ అధికారులు వెల్లడించారు. కరోనా ప్రభావం వల్లే ఉద్యోగులను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు డిస్నీ ఉద్యోగుల వ్యవహారాల ఉపాధ్యక్షుడు జిమ్ బౌడెన్ తెలిపారు.

అమెరికాలో కరోనా ప్రబలిన తర్వాత డిస్నీ పార్కులను మూసివేశారు. అనంతరం ఫ్లోరిడాలోని పార్క్ తెరచుకోగా.. కరోనా నిబంధనలు కొనసాగుతున్న కాలిఫోర్నియాలో డిస్నీ పార్కు పునఃప్రారంభం కాలేదు.

ఇదీ చదవండి- ప్రభుత్వరంగ బ్యాంకుల 'ప్రైవేటీకరణ' మరో దుస్సాహసమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.