ట్రక్కుల తయారీ కంపెనీ అశోక్ లేల్యాండ్ శుక్రవారం మార్కెట్లోకి సరికొత్త వాహనాన్ని విడుదల చేసింది. 4 యాక్సిల్స్‌తో 14 చక్రాలపై నడిచే ఏవీటీఆర్ 4120ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ట్రక్ 40.5 టన్నుల సరకులు మోయగలదు.
ఈ కంపెనీ ఉత్పత్తి చేసే స్టాండర్డ్ ట్రక్కులతో పోలిస్తే ఇది 5 టన్నులు ఎక్కువ. ఈ సందర్భంగా అశోక్ లేల్యాండ్ ఎండీ విపిన్ సోంధీ మాట్లాడుతూ 'మా వినియోగదారుల అవసరాలను తీర్చేలా మా ప్రయత్నాలు ఉంటాయి. వారికి మెరుగైన ఉత్పత్తులను, మరింత లాభాలను అందించడమే మా లక్ష్యం. ఆ దిశగా మేం వేసిన మరో అడుగు ఏవీటీఆర్ 4120 ట్రక్కు' అని పేర్కొన్నారు.
ఈ ట్రక్కులో 12.5టన్ డ్యూయల్ టైర్ లిఫ్ట్ యాక్సిల్‌ను అమర్చారు. దీనిపై కంపెనీకి పేటెంట్ కూడా ఉంది. ఇది టైర్ల జీవితకాలాన్ని పెంచుతుంది. దీనిలో 200హెచ్‌పీ ఇంజిన్‌ను అమర్చారు. ఇప్పుడు ఈ సృజనాత్మకమైన ట్రక్కు కస్టమర్లకు మరింత సౌలభ్యతను అందిస్తుందని కంపెనీ సీవోవో అంజూ కథూరియా పేర్కొన్నారు. ట్రక్కులో చాలా ఆప్షన్లు ఉన్నాయని వెల్లడించారు.
ఇదీ చదవండి: బీఎండబ్ల్యూ కొత్త బైక్ రిలీజ్- ధర ఎంతో తెలుసా?