ETV Bharat / business

3 ట్రిలియన్​ డాలర్ల తొలి కంపెనీగా 'యాపిల్​' ఘనత!

Apple market value today: యాపిల్​ సంస్థ మార్కెట్​ విలువ 3 ట్రిలియన్​ డాలర్లను తాకింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 3 ట్రిలియన్​ డాలర్ల క్లబ్​లో చేరిన తొలి సంస్థగా యాపిల్​ చరిత్ర సృష్టించింది.

Apple market value today
3 ట్రిలియన్​ డాలర్ల కంపెనిగా 'యాపిల్​'!
author img

By

Published : Jan 4, 2022, 12:27 PM IST

Apple market value today: టెక్​ దిగ్గజం యాపిల్​ అరుదైన రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా.. 3 ట్రిలియన్​ డాలర్ల(రూ. 3 లక్షల కోట్లు) మార్కెట్​ విలువను సాధించిన తొలి సంస్థగా నిలిచింది. సంస్థ షేర్లు సోమవారం.. 3శాతం పెరిగి 182.82 డాలర్లు దాటిన క్రమంలో యాపిల్​ ఈ ఘనత సాధించింది. ఆ తర్వాత స్టాక్​ విలువ స్వల్పంగా పడిపోయింది. ప్రస్తుతం సంస్థ మార్కెట్​ విలువ 2.9 ట్రిలియన్​ డాలర్లుగా ఉంది.

యాపిల్​ సంస్థ.. 2018లో 1 ట్రిలియన్​ డాలర్లు, 2020 ఆగస్టులో 2 ట్రిలియన్​ డాలర్ల మార్కును అందుకుంది. 2021లో సంస్థ షేర్ల విలువ 35శాతం మేర పెరిగింది. యాపిల్​ ఉత్పత్తుల్లో ఐఫోన్​ 13తో పాటు ఇతర స్మార్ట్​ఫోన్​లకు విశేష ఆదరణ లభిస్తుండటం సంస్థకు సానుకూలంగా మారింది. గత సెప్టెంబర్​తో ముగిసిన త్రైమాసికానికి అమ్మకాలు 83బిలియన్​ డాలర్లు దాటాయి.

Apple hits 3 trillion market cap: తాజాగా.. 3 ట్రిలియన్​ డాలర్ల మార్కును యాపిల్​ అందుకోగా.. మరికొన్ని సంస్థలు కూడా త్వరలోనే ఆ మైలురాయికి చేరే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం.. మైక్రోసాఫ్ట్​ కంపెనీ విలువ 2.5ట్రిలియన్​ డాలర్లుగా ఉండగా.. గూగుల్​ మాతృసంస్థ ఆల్ఫబెట్​ విలువ 2 ట్రిలియన్​ డాలర్లుగా ఉంది.

ఈ-కామర్స్​ దిగ్గజం ఆమెజాన్​(1.7ట్రిలియన్​ డాలర్లు), ఎలాన్​ మస్క్​కు చెందిన టెస్లా(1.2ట్రిలియన్​ డాలర్లు).. ఈ రేసులో కాస్త వెనకంజలో ఉన్నాయి.

ఇదీ చూడండి:- అత్యంత సంపన్న మహిళల్లో రెండో స్థానానికి 'నైకా' ఫౌండర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.