ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్... భారత్‌లో తన చెల్లింపులు, హోల్‌సేల్ బిజినెస్ యూనిట్ల కోసం రూ.1,700 కోట్లు కేటాయించింది. దీని ద్వారా భారత్‌లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకోవాలని భావిస్తోంది.
అమెజాన్ కార్పొరేట్ హోల్డింగ్స్, అమెజాన్.కామ్.ఐఎన్సీఎస్.లిమిటెడ్... అమెజాన్ పే ఇండియాకు రూ.1,335కోట్లు అందించాయి. ఫలితంగా అమెజాన్ హోల్‌సేల్(ఇండియా)కు రూ.360 కోట్ల విలువైన షేర్లను అమెజాన్ కార్పొరేట్ హోల్డింగ్స్, అమెజాన్.కామ్.ఐఎన్సీఎస్. లిమిటెడ్‌లకు కేటాయించింది. ఇందుకు సంబంధించిన పత్రాలను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖకు అందించారు.
డిజిటల్ చెల్లింపు యూనిట్ 2019 డిసెంబర్ 31న షేర్లను కేటాయించగా, అమెజాన్ హోల్‌సేల్ (ఇండియా) డిసెంబర్ 30న కేటాయింపులు చేసింది. అయితే ఫండ్ ఇన్ఫ్యూషన్పై అమెజాన్ ఇండియాకు పంపిన ఈ-మెయిల్స్‌పై ఎలాంటి స్పందన రాలేదు.
భారత్‌లో బెజోస్
భారత్‌లో పర్యటిస్తున్న అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్... చిన్న, మధ్య తరహా వ్యాపారాలను డిజిటలైజ్ చేయడానికి దేశంలో 1 బిలియన్ డాలర్లు పెట్టుబడిపెడుతున్నట్లు ప్రకటించారు. అలాగే తన పర్యటనలో భాగంగా ప్రభుత్వ పెద్దలతో, వ్యాపారులతో, ఎస్ఎమ్బీలతో కలిసే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: భారత్‌లో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి: జెఫ్ బెజోస్