దేశంలో మొబైల్ ఇంటర్నెట్ మీడియన్ డౌన్లోడ్ స్పీడ్‌లో ఎయిర్టెల్ నెట్వర్క్ అగ్రస్థానంలో నిలిచింది. వొడాఫోన్, జియో, బీఎస్ఎన్ఎల్లు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. బ్రాడ్‌బాండ్ సర్వీస్ అనలిటిక్స్ సంస్థ టుటెలా చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 2019 ఆగస్టు నుంచి 2020 జనవరి వరకు 573 బిలియన్ శాంపిళ్లను విశ్లేషించి ఈ గణాంకాలను వెల్లడించింది. థర్డ్ పార్టీ మొబైల్ యాప్‌ల నుంచి సేకరించిన డేటా ద్వారా ఈ విశ్లేషణ చేసినట్లు టుటెలా తెలిపింది.
డౌన్లోడ్ స్పీడ్ ఇలా..
- ఎయిర్టెల్ - 7.4 ఎంబీపీఎస్
- వొడాఫోన్ ఐడియా - 6.5 ఎంబీపీఎస్
- జియో - 5.3 ఎంబీపీఎస్
- బీఎస్ఎన్ఎల్ - 2.9 ఎంబీపీఎస్
దేశంలో వేగంవంతమైన డేటాను అందిస్తున్న టెల్కోగా భారత టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్' రిలయన్స్ జియోను గుర్తించింది. అయితే ఓ ప్రైవేటు సంస్థ చేసిన సర్వేలో జియో మూడో స్థానంలో నిలవడం గమనార్హం.
అప్లోడ్ స్పీడ్‌లో మాత్రం ఎయిర్టెల్, జియోలకు షాకిస్తూ వొడాఫోన్ ఐడియా అగ్ర స్థానంలో నిలిచింది.
ఆప్‌లోడ్ స్పీడ్ ఇలా..
- వొడాఫోన్ ఐడియా - 3.7 ఎంబీపీఎస్
- ఎయిర్టెల్ - 3.5 ఎంబీపీఎస్
- జియో - 3.2 ఎంబీపీఎస్
- బీఎస్ఎన్ఎల్ - 1.7 ఎంబీపీఎస్
ఇదీ చూడండి:ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త- ఇక కనీస నిల్వ అక్కర్లేదు