ETV Bharat / business

ఎయిర్‌టెల్‌- జియో డీల్‌ పూర్తి.. టెలికాం చరిత్రలో ఇదే తొలిసారి!

స్పెక్ట్రమ్‌ వినియోగానికి సంబంధించి ఎయిర్‌టెల్‌- జియో మధ్య కుదిరిన డీల్‌ విజయవంతంగా పూర్తయ్యింది. ఇందులో భాగంగా రూ.1,004.8 కోట్లు తమకు అందినట్లు ఎయిర్‌టెల్‌ శుక్రవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

airtel jio deal, spectrum deal jio airtel
ఎయిర్‌టెల్‌- జియో డీల్‌ పూర్తి.. టెలికాం చరిత్రలో ఇదే తొలిసారి!
author img

By

Published : Aug 13, 2021, 10:58 PM IST

దేశవ్యాప్తంగా మూడు సర్కిళ్లలో స్పెక్ట్రమ్‌ వినియోగానికి సంబంధించి ఎయిర్‌టెల్‌- జియో మధ్య కుదిరిన డీల్‌ విజయవంతంగా పూర్తయ్యింది. దీంతో ఎయిర్‌టెల్‌కు చెందిన 800 MHz స్పెక్ట్రమ్‌ను వినియోగించే హక్కు జియోకు దఖలు పడింది. రెండు ప్రధాన ప్రత్యర్థి టెలికాం కంపెనీల మధ్య ఇలాంటి ఓ ఒప్పందం విజయవంతమవ్వడం ఇదే తొలిసారి. యూజర్‌ బేస్‌ పరంగా జియో తొలి స్థానంలో ఉండగా.. ఎయిర్‌టెల్‌ రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌ (3.75 MHz), దిల్లీ (1.25 MHz), ముంబయి (2.50 MHz) సర్కిళ్ల పరిధిలోని ఎయిర్‌టెల్‌కు చెందిన స్పెక్ట్రమ్‌ వినియోగ హక్కుల బదిలీకి ఈ ఏడాది మొదట్లో రెండు కంపెనీల మధ్య పరస్పర ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా రూ.1,004.8 కోట్లు తమకు అందినట్లు ఎయిర్‌టెల్‌ శుక్రవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. దీంతో పాటు ఈ స్పెక్ట్రమ్‌ వినియోగానికి గానూ జియో భవిష్యత్‌లో రూ.469.3 కోట్ల మేర చెల్లింపులు జరపాల్సి ఉంటుందని ఎయిర్‌టెల్‌ తెలిపింది.

ఇదీ చదవండి : ట్విట్టర్​ ఇండియా ఎండీ బదిలీ​- నెక్ట్స్​ బాస్ ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.