'విమాన భద్రతా రుసుము' (ఏఎస్ఎఫ్) పెంచుతూ పౌరవిమానయాన మంత్రిత్వశాఖ తీసుకున్న నిర్ణయంతో ఇకపై విమాన ప్రయాణం కాస్తంత ప్రియంకానుంది.
భారత ప్రయాణికులకు ఏఎస్ఎఫ్ని రూ.130 నుంచి రూ.150లకు పెంచింది పౌరవిమానయానశాఖ. విదేశీ ప్రయాణికులకైతే ఈ రుసుమును 3.25 డాలర్ల నుంచి 4.85 డాలర్లకు పెంచింది. ఈ ధరలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఇప్పటి వరకు ఉన్న 'ప్రయాణికుల సేవా రుసుము' స్థానంలో 'విమాన భద్రతా రుసుము'ను ఇటీవలే ప్రవేశపెట్టింది పౌరవిమానయాన మంత్రిత్వశాఖ. ఇందులో భాగంగా భద్రతా రుసమునూ పెంచింది. ఈ పెంపుతో టిక్కెట్ల ధరలు స్వల్పంగా పెరగనున్నాయి.
ఇదీ చూడండి: సిరి: ఆన్లైన్లో 'వీలునామా' రాయండిలా...